Anemia : ఈ లడ్డూను రోజుకొకటి తిన్నారంటే ఎముకల బలహీనత నుంచి రక్తహీనత వరకు అన్ని జబ్బులు పరార్?

ఇటీవల కాలంలో ఆరోగ్య‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న వారి సంఖ్య భారీగా త‌గ్గిపోయింది.

దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ రక్తహీనత, ఎముకల బలహీనత, అధిక బరువు, హైపర్ టెన్షన్ ఇలా ఏదో ఒక సమస్యతో బాధ‌పడుతున్నారు.

అయితే చాలా వరకు సమస్యలను పోషకాహారంతోనే తిప్పి కొట్టవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే లడ్డూను రోజుకు ఒకటి తిన్నారంటే ఎముకల బలహీనత నుంచి రక్తహీనత వరకు అనేక జబ్బులు పరార్ అవుతాయి.

మరి ఇంతకీ ఆ లడ్డు ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం పప్పు( Almonds ) వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వేరుశనగలు( Peanuts ) , అరకప్పు నువ్వులు( Sesame seeds ) వేసి వేయించుకొని పెట్టుకోవాలి.మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు డ్రై అంజీర్ వేసి ఒక కప్పు వేడి నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

Advertisement
Eating This Laddu Will Cure All Problems From Bone Weakness To Anemia-Anemia :

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న బాదం, నువ్వులు, వేరుశనగలు వేసి బరకగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోకి వేసుకోవాలి.

Eating This Laddu Will Cure All Problems From Bone Weakness To Anemia

ఆపై మిక్సీ జార్లో నానపెట్టుకున్న డ్రై అంజీర్‌( Dry Fig ), ప‌ది నుంచి ప‌న్నెండు గింజ తొలగించిన ఖర్జూరాలు ( Dates )మరియు రెండు స్పూన్ల తేనె వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బాదం నువ్వులు వేరుశ‌నగల పొడిలో వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ లడ్డూను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ లడ్డూలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

డైలీ డైట్ లో ఈ లడ్డూను చేర్చుకుంటే బలహీనమైన ఎముకలు దృఢంగా, గట్టిగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వేధించకుండా ఉంటాయి.

Eating This Laddu Will Cure All Problems From Bone Weakness To Anemia
Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

అలాగే రక్తహీనతతో బాధపడే వారికి ఈ లడ్డు ఎంతో మేలు చేస్తుంది.ఈ లడ్డూ లో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.రక్తహీనతను తరిమి కొడుతుంది.

Advertisement

ఈ లడ్డూలో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది.అంతేకాదు ఈ హెల్తీ ల‌డ్డూను డైట్ లో చేర్చుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఉంటారు.

నీరసం, అలసట తలెత్తకుండా ఉంటాయి.మహిళల్లో నెలసరి సమస్యలు దూరం అవుతాయి.

కొలెస్ట్రాల్ క‌రిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.మరియు ఈ లడ్డూను తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు