పడుకునే ముందు అరటిపండు తింటే చాలా లాభాలున్నాయి

పడుకునే ముందు ఫలాలు తినొద్దని కొందరు చెబుతారు.అందులోనూ అరటిపండు తినవద్దని, సరిగా జీర్ణం కాదని లేని విషయాలు మాట్లాడుతారు.

నిజానికి రాత్రి పడుకునే ముందు అరటిపండు తింటే చాలా మంచిది.ఎలానో చూడండి.

* రాత్రి సుఖమైన నిద్ర అవసరం.ఆటంకం లేని నిద్ర రావాలంటే మేలాటోనిన్ అనే హార్మోన్ అత్యవసరం.

అరటిపండులో ట్రిప్టోనిన్ అనే ఎమినో ఆసిడ్ ఉండటం వలన మేలాటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి.దాంతో సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.

Advertisement

* కండరాలలో నొప్పులు ఉంటే నిద్రపట్టడం కష్టమవుతుంది.అరటిలో ఉండే పొటాషియం మరియు మెగ్నిషీయం శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లెవెల్ పెంచి కండరాలలో నొప్పిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.

* రాత్రిపూట జీర్ణక్రియ బాగా జరగాలంటే ఫైబర్ అవసరం.అరటిపండులో ఫైబర్ దండీగా దొరుకుతుంది.* కొందరికి భోజనం చేసిన తరువాత తీపి వస్తువు ఏదైనా తినాలనిపిస్తుంది.

అలాంటప్పుడు స్వీట్స్ పై ఆధారపడకుండా,తియ్యగా ఉండే అరటిపండు లాగించండి.* బ్లడ్ ప్రెషర్ పెరగకూడదు అంటే, రోజూ మన శరీరంలో సరిపడా పొటాషియం పడుతూ ఉండాలి.

వయసులో ఉన్నవారు రోజుకి 4700 మిల్లిగ్రాముల పొటాషియం తీసుకోవాలి.అంత స్ట్రిక్ట్ గా డైట్ పాటించే వీలు లేనప్పుడు, పొటాషియం లెవెల్స్ బాగా దొరికే అరటి పండుని  పడుకునే ముందు తినే అలవాటు చేసుకోవాలి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
ఈ జ్యూసుల‌తో వేగంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు..తెలుసా?

అప్పుడు పొటాషియం డిఫీషియెన్సీ వంటి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

Advertisement

తాజా వార్తలు