ఫైబర్ కొరతను అధిగమించేందుకు ఈ ఆహారాలు తీసుకోండి!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఫైబ‌ర్( Fiber ) ఒక‌టి.ఫైబ‌ర్ మ‌న బాడీలో కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది.

జీర్ణవ్యవస్థ( Digestive system )ను ఆరోగ్యంగా ఉంచడం ఫైబర్ యొక్క ముఖ్య బాధ్య‌త‌.అలాగే రక్తంలో చక్కెర స్పైక్‌లను నివారించడానికి, శ‌రీర బ‌రువును అదుపులో ఉంచ‌డానికి, మలబద్ధకం ప్రమాదాన్ని త‌గ్గించ‌డానికి ఫైబ‌ర్ స‌హాయ‌ప‌డుతుంది.

అయితే స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది ఫైబ‌ర్ తీసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ్య‌వ‌హ‌రిస్తుంటారు.ఫ‌లితంగా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.

ఈ నేప‌థ్యంలోనే ఫైబ‌ర్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఫైబ‌ర్ రిచ్ ఫుడ్స్ లో చియా సీడ్స్( Chia seed ) ముందు వ‌రుస‌లో ఉంటాయి.ప్ర‌తి రోజు ఉద‌యం వ‌న్ టీ స్పూన్ చియా సీడ్స్ ను ఒక గ్లాస్ వాట‌ర్ లో నాన‌బెట్టి తీసుకోవాలి.నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

కాబ‌ట్టి, నిత్యం గుప్పెడు న‌ట్స్ తీసుకోవాలి.ముఖ్యంగా బాదం, పిస్తా, వాల్ న‌ట్స్‌, జీడిప‌ప్పు, బ్రెజిల్ న‌ట్స్ ను తినండి.

అలాగే కొందరికి నిత్యం ఫ్రూట్ జ్యూస్ తీసుకునే అలవాటు ఉంటుంది.అయితే ఫైబర్ కొరతను అధిగమించేందుకు పండ్లను జ్యూసుల రూపంలో కాకుండా నేరుగా తీసుకోవాలి.అప్పుడే పండ్లలోని ఫైబర్ కంటెంట్ మొత్తం శరీరానికి అందుతుంది.

పచ్చి బఠానీలు ఫైబ‌ర్ కంటెంట్ కు గొప్ప మూలం.ప్రోటీన్ కూడా మెండుగా ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ఉడికించిన పచ్చి బ‌ఠానీల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఫైబ‌ర్ కొర‌తకు చెక్ పెట్ట‌వ‌చ్చు.రోజూవారీ వంట‌ల్లో భాగంగా కొంద‌రు ఎక్కువ‌గా మైదా వాడుతుంటారు.

Advertisement

కానీ మైదాలో ఫైబ‌ర్ అనేది ఉండ‌దు.అందువ‌ల్ల హైదాకు బ‌దులుగా గోధుమ పిండిని ఉప‌యోగించాలి.

ప‌ప్పులు, తృణధాన్యాలు, క్యారెట్స్‌, అవ‌కాడో, యాపిల్‌, ఓట్స్‌, గుమ్మ‌డి గింజ‌లు, అవిసె గింజ‌లు వంటి ఆహారాల్లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

తాజా వార్తలు