Nag Ashwin prabhas : కిరాయికి తేలేముగా.. సమయం పడుతుంది ప్రాజెక్టు కే పై నాగ్ అశ్విన్ కామెంట్స్!

మహానటివంటి అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్ కే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమాకి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ కేటాయించి అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ విధంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు విడుదల చేయలేదు.ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే విషయం గురించి డైరెక్టర్ ఎక్కడ ప్రస్తావించలేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమా అప్డేట్ గురించి నేటిజన్స్ డైరెక్టర్ ను ప్రశ్నించగా ఈయన ఈ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రాజెక్టుకే సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Easy To Rent Nag Ashwin Comments On The Project Will Take Time , Nag Ashwin , P

ఈ క్రమంలోనే ఈ సినిమా చేయాలంటే ప్రతిదీ మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది.

Easy To Rent Nag Ashwin Comments On The Project Will Take Time , Nag Ashwin , P

మహానటి సినిమా చేసాము అందులో ఒక కారు కావాలంటే వెళ్లి కిరాయికి తెచ్చుకోవచ్చు కానీ ఇందులో అవసరమయ్యే ప్రతి ఒక్క వస్తువును సృష్టించుకోవాలి అందుకు సమయం పడుతుందంటూ ఈ సినిమా గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు