Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు..!!

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయి ప్రజలు సతమతమవుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే శనివారం రాత్రి 7.

57 గంటల సమయంలో రిక్టర్ స్కేలు పై 5.4 తీవ్రతతో.భూ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించడం జరిగింది.

భూకంప కేంద్రం నేపాల్ లో ఉందని స్పష్టం చేసింది.దేశ రాజధాని ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో భూప్రకంపనలు రావటం ఇది రెండోసారి.

గత బుధవారం ఢిల్లీలో భూమి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు.ఆ సమయంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఈ క్రమంలో తగిన చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటే ప్రాణ మరియు ఆస్తి నష్టాలు తగ్గించవచ్చు అని పేర్కొన్నారు. కాగా శనివారం ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్ వంటి పలు ఉత్తరాది ప్రాంతాల్లో భూమి కంపించింది.

Advertisement

దీంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.ఒకవైపు వాయు కాలుష్యం మరోవైపు భూప్రకంపనాలతో ఢిల్లీ నగరవాసులు భయాందోళనలు చెందుతున్నారు.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు