ఈ-రూపీ యాప్ వచ్చేసింది.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( Reserve Bank of India )డిజిటల్ కరెన్సీని విడుదల చేసింది.

ఈ-రూపీ పేరులో డిటిజల్ కరెన్సీని విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ డిజిటల్ రూపీని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది.ప్రస్తుతం కొంతమందికి మాత్రమే డిజిటల్ రూపీ( Digital rupee ) అందుబాటులోకి రాగా.

త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.ఇవి అందుబాటులోకి వస్తే యూపీఐ తరహాలోనే చాలా సులువుగా వాడుకోవచ్చు.

ఇప్పటివరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తో 21 బ్యాంకులు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.ఈ బ్యాంకుల కస్టమర్లు మాత్రమే డిజిటల్ రూపీని ఉపయోగించే అవకాశం లభించింది.

Advertisement

ఇందుకోసం ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ-రూపీ అనే ఈ యాప్( E-Rupee app ) ను డౌన్ లోడ్ చేసుకుని ఈ సేవలను పొందవచ్చు.ప్రతి బ్యాంకుకు ఒక ఈ-రూపీ వ్యాలెట్ కనిపిస్తుంది.

మీ బ్యాంక్ ఈ-రూపీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత పిన్ సెట్ చేసుకోవాలి.

అలాగే సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.వివరాలు అన్నీ పూర్తి చేసిన తర్వాత M పిన్ పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌తో వ్యాలెట్‌ను లింక్ చేసుకుంటే సరిపోతుంది.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఎవరికైనా డబ్బులు పంపాలంటే హోమ్ పేజీలో కనిపించే సెండ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు.ఇక డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే మీ క్యూఆర్ కోడ్‌ను అవతలి వ్యక్తికి షేర్ చేయాలి.

Advertisement

వాళ్లు స్కాన్ చేసి మీకు డబ్బులు పంపించవచ్చు.అలాగే లోడ్ ఆప్షన్ ద్వారా డబ్బులు వ్యాలెట్‌లో వేసుకోవచ్చు.

ఒక రూపాయి, 50 పైసలను కూడా లోడ్ చేసుకోవచ్చు.వ్యాలెట్‌లోకి డబ్బులు యాడ్ కాగానే.

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.

తాజా వార్తలు