దుమ్ములేపిన భారత వైమానిక దళం.. పాకిస్థాన్, చైనాకు చెక్!

కొన్నేళ్లుగా భారత్ తన ఉనికి ప్రపంచానికి చాటుతోంది.ప్రపంచ దేశాలు కూడా ఇక్కడి అభివృద్ధిని చూస్తున్నాయి.

మొత్తంగా మోడీ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలిగిపోతోంది చెప్పుకోవాలి.అవును, ఈ క్రమంలో పొరుగుదేశాలైన చైనా - పాకిస్థాన్‌లకు( China - Pakistan ) చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధంగా ఉంది.

దీనికి సంబంధించి భారత వైమానిక దళం( Indian Air Force ) (IAF) హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాక్టీస్ మిషన్‌ను తాజాగా దిగ్విజయంగా నిర్వహించింది.దాదాపు 6 గంటల పాటు ఈ మిషన్ కొసనసాగగా ఈ సమయంలో IAF తన శక్తి యుక్తులను ప్రదర్శించింది.

ఇందులో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ రాఫెల్ శత్రు యుద్ధ విమానాలను కూల్చివేసే సాధన చేపట్టింది.

Advertisement

ఇక ఈ మిషన్ ద్వారా IAF తన పూర్తి శక్తిని విజయవంతంగా ప్రదర్శించిందని ఈ మిషన్‌లో పాల్గొన్న ఒక అధికారి మీడియాతో చెప్పడం జరిగింది.ఎన్ని మైళ్ళ దూరం నుండి కూడా శత్రువులపై దాడి చేయగల సామర్థ్యం సైన్యానికి ఉందని దాంతో తేలిపోయింది.ఈ క్రమంలో ఆధునిక రాఫెల్‌లు హసిమారా (ఎయిర్‌బేస్)కి తిరిగి వచ్చే సమయంలో IL-78 ట్యాంకర్ల ద్వారా గాలిలో ఇంధనం నింపాయని ఆయన తెలిపారు.

కాగా ఈ విషయం చూసిన మన పొరుగు దేశాల గుండెల్లో గుబులు పుడుతోంది.

ఇకపోతే, ప్రపంచంలోని అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో రాఫెల్( Raphael ) ఒకటన్న విషయం అందరికీ తెలిసినదే.ఇది భారత వైమానిక దళం బలాన్ని వేయిరెట్లు పెంచిందని చెప్పుకోవాలి.2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో రూ.59,000 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత వైమానిక దళం తన శక్తిని ప్రదర్శించేందుకు హసిమారా, అంబాలా వద్ద IAF తన 36 రాఫెల్‌లను చేర్చుకుంది.హసిమారా సిక్కిం-భూటాన్-చైనా ట్రై-జంక్షన్‌కు సమీపంలో ఉంది.

ఇక్కడి నుండే అసలు కధ మొదలైంది.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?
Advertisement

తాజా వార్తలు