సంచలన కథతో దుల్కర్ సల్మాన్..!

మళయాళ హీరోనే అయినా కూడా తెలుగు, తమిళ భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్ కి సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు.

బాలీవుడ్ లో కూడా సినిమాలు తీస్తూ వస్తున్న దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

తెలుగులోనే కాదు సౌత్ అన్ని భాషల్లో ఈ మూవీ రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.హిందీలో కూడా సెప్టెంబర్ 2న సీతారామం రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత దులర్ బాలీవుడ్ క్రేజీ డైరక్టర్ ఆ బాల్కి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.ఆ సినిమా కథ సెన్సేషనల్ గా ఉంటుందని టాక్.

సినిమా రివ్యూలు రాసి తక్కువ రేటింగ్ ఇచ్చే వారిని చంపే ఒక సైకో కిల్లర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఉంటుందట.ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వస్తుందని తెలుస్తుంది.

Advertisement

అక్షయ్ కుమార్ తో ప్యాడ్ మ్యాన్, మిషన్ మంగళ్, అమితాబ్ తో పా, చీనీకం, శ్రీదేవితో ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన బాల్కి దుల్కర్ తో చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు