ఆన్లైన్ వివాదం కారణంగా.. ఆ దేశం లో కాల్పులు..

ఈ మధ్యకాలంలో ఆన్లైన్ వాడకం ఎక్కువగా అయిపోయింది.అయితే ఆన్లైన్ కారణంగా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో హత్యలు, ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

అయినప్పటికీ సోషల్ మీడియా వాడకం మాత్రం ప్రపంచం తగ్గించడం లేదు.అయితే సోషల్ మీడియా కారణంగా అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి.

అమెరికాలో అట్లాంటాలోనీ ఒక అపార్ట్మెంట్లో కాల్పులు జరిగాయి.అయితే ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది.

ఈ సంఘటనలో ఇద్దరు టీనేజర్స్ మరణించారు.ఇక పలువురు గాయపడ్డారు.

Advertisement

అయితే గాయపడిన వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే ఈ వివాదం సోషల్ మీడియాతో మొదలైందని తెలిసింది.

ఇక సోషల్ మీడియాతో మొదలైన వివాదం ఈ ఇద్దరి టీనేజర్స్ మరణానికి కారణమైంది.అయితే కాల్పుల సంఘటనలో 14, 16 వయసున్న ఇద్దరు అబ్బాయిలు చనిపోవడం జరిగింది.

అలాగే ఇద్దరు అబ్బాయిలు, 15 ఏళ్ల బాలిక గాయపడింది.ఈ విషయాన్ని డిప్యూటీ చీఫ్ చార్లెస్ హాంప్టన్ జూనియర్ తెలిపాడు.

అయితే ఈ కాల్పులకు కారణం టీనేజర్స్ లో సోషల్ మీడియా వివాదమే అని తెలిసింది.అయితే తుపాకులు తీసుకొని కొందరు యువకులు అపార్ట్మెంట్ కు శనివారం సాయంత్రం 5 గంటలకు వచ్చారు.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

అయితే వాళ్ళని చూసిన మరో గ్రూప్ కాల్పులు మొదలుపెట్టింది.ఇలా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

Advertisement

అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.అయితే ఈ సందర్భంగా సిటీలోని చాలామంది టీనేజర్స్ దగ్గర గన్స్ ఉన్నాయని హాంప్టన్ వెల్లడించాడు.

అలాగే ఈ గన్ ఫైర్ వెనుక సోషల్ మీడియా కాకుండా మరి ఏదైనా కారణం ఉందేమో అని అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అలాగే ఇంత చిన్న వయసులో కాల్పులు చేయడం, ఆ సంఘటనలో మరణించడం అంటే బాధ కలిగించే విషయం అనే చెప్పాలి.సోషల్ మీడియా ఇంత చిన్న వయస్సు ఉన్నవాళ్లను కూడా హంతకులను చేస్తుందని చెప్పవచ్చు.

అందుకే సోషల్ మీడియా వాడకం ఎంత తగ్గితే అంత మంచిది.