సౌత్‌ ఇండియా అతిపెద్ద ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ప్రతీ ఒక్కరికి విద్య అనేది చాలా అవసరమని.విద్య ద్వారానే అనేక అవకాశాలు వస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కీర్తిప్రతిష్టతలను వ్యాప్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు.బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని కంత్రీయాహోటల్‌లో ఏర్పటు చేసిన సౌత్‌ ఇండియా అతిపెద్ద ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ఆయన ప్రారంభించారు.

Dubbaka MLA Raghunandan Rao Speech At Biggest Educational Fair, Dubbaka MLA Ragh

ఈ కార్యక్రమంలో రఘునందన్‌రావుతో పాటు సినీ కథానాయికలు షేర్రి అగర్వాల్‌, ప్రియాంకశర్మ, బ్లూ రిబ్బన్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ నిర్వహకులు సంతోష్‌, రణదీర్‌ తదితరులు పాల్గొన్నారు.భారతీయ విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అనేక అవకాశాలు ఉన్నాయని.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.ప్రస్తుతం ఏ కొత్త కంపెనీ, ఏ పెద్ద కంపెనీ ,మల్టీ నేషనల్ కంపెనీ చూసిన దానికి సీఈఓగా భారతీయులు ఎదిగిరన్నారు.గత15 సంవత్సరాలుగా బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థ కృషి అభినందనీయమన్నారు.విద్యార్థులందరు తమ విద్యను, పనితీరును మెరుగు పరుచుకుని విశ్వవ్యాప్తంగా జరిగే పోటీల్లో పాల్గొని భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలన్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు