అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం

అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ సప్లైపై విచారణ చేపట్టిన అనంతపురం పోలీసులు ఓ వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్ చేశారు.

నిందితుడు నైజీరియాకు చెందిన ఆంటోని శామ్యూల్ గా పోలీసులు గుర్తించారు.అనంతరం నిందితుడి నుంచి ఎనిమిది గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

పీటీ వారెంట్ పై నైజీరియన్ శామ్యూల్ ను అదుపులోకి తీసుకున్నారు.కాగా ఈ కేసులో గత నెల 20న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.నిందితుడు శామ్యూల్ ను బెంగళూరు పరప్పర జైలు నుంచి అనంతపురానికి తీసుకు వస్తున్నారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు