Drug Supplier Arrest : హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్..!!

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Party ) కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

విచారణలో భాగంగా డ్రగ్స్ సప్లయిర్ సయ్యద్ అబ్బాస్ అలీని( Drug supplier Syed Abbas Ali ) గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే అబ్బాస్ అలీని పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది.

అలాగే ఈ కేసులో సందీప్ ( Sandeep ) అనే వ్యక్తితో పాటు మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.ఇప్పటికే కేసులో ఎఫ్ఐఆర్ రెడీ చేసిన పోలీసులు పది మంది పేర్లను పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పార్టీకి హాజరైన వారిలో కొంతమందికి నోటీసులు అందించారని సమాచారం.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?
Advertisement