Krish Radisson Drugs Case : డ్రగ్స్ పార్టీ కేసు.. నెగిటివ్ గా డైరెక్టర్ క్రిష్ యూరిన్ నివేదిక

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు( Radisson Drugs Case )లో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

సినీ డైరెక్టర్ క్రిష్( Director Krish ) యూరిన్ నివేదిక పోలీసులకు అందింది.

ఈ మేరకు డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నివేదికలో వెల్లడైందని తెలుస్తోంది.క్రిష్ బ్లెడ్ శాంపిల్స్ నివేదిక ఇచ్చేందుకు మరి కొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.

అయితే మొదటి నుంచి క్రిష్ డ్రగ్స్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న సంగతి తెలిసిందే.తన స్నేహితుడు చరణ్( Charan ) కలిసేందుకు మాత్రమే హోటల్ కు వెళ్లానని ఆయన తెలిపారు.కాగా నిన్న పోలీసుల విచారణకు హాజరైన క్రిష్ వద్ద నుంచి పోలీసులు శాంపిల్స్ తీసుకున్నారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు