ఈ ఎన‌ర్జీ డ్రింక్ తాగితే వేస‌విలో నీర‌సం అన్న మాటే అన‌రు!

వేస‌వి కాలం వ‌చ్చిందంటే చాలు మండే ఎండ‌లు, ఉక్క‌పోత కార‌ణంగా ఎక్క‌డ్లేని నీర‌సం వ‌చ్చేస్తుంటుంది.ఈ నీర‌సం ఓ ప‌ట్టాన పోదు.

దాంతో ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎన‌ర్జీ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే గనుక సీర‌సం అన్న మాటే అన‌రు.

మ‌రి ఆ ఎన‌ర్జీ డ్రింక్ ఏంటీ.? దానిని ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక క్యారెట్‌, ఒక బీట్ రూట్, అర అంగుళం అల్లం ముక్క‌ తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక క‌ప్పు మున‌గాకు తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో క్యారెట్ ముక్క‌లు, బీట్ రూట్ ముక్క‌లు, అల్లం ముక్క‌లు, అర క‌ప్పు బెల్లం తురుము వేసి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement
Drinking This Energy Drink Will Help You Avoid Getting Fatigue In The Summer! En

ఆ త‌ర్వాత అందులో ఒక క‌ప్పు మున‌గాకు కూడా వేసి మ‌రో ప‌ది నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.బాగా కూల్ అయిన వెంట‌నే బ్లెండ‌ర్‌లో ఉడికించిన‌వ‌న్నీ వాట‌ర్‌తో స‌హా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

చివ‌రిగా ఒక క‌ప్పు పాలు కూడా వేసి మ‌ళ్లీ గ్రైండ్ చేసుకుంటే ఎన‌ర్జీ డ్రింక్ సిద్ధ‌మైన‌ట్టే.

Drinking This Energy Drink Will Help You Avoid Getting Fatigue In The Summer En

ప్ర‌స్తుత‌ వేస‌వి కాలంలో ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఈ సూప‌ర్ టేస్టీ ఎన‌ర్జీ డ్రింక్‌ను తీసుకుంటే గ‌నుక నీర‌సం మీ దారి దాపుల్లోకి కూడా రాదు.అలాగే ఈ డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.గుండె జబ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

మ‌రియు మ‌లినాలు తొల‌గిపోయి లివ‌ర్ శుభ్రంగా, ఆరోగ్యంగా కూడా మారుతుంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు