Green Juice : రోజు ఈ గ్రీన్ జ్యూస్ ను తీసుకుంటే వెయిట్ లాస్ నుంచి హెల్తీ స్కిన్ వరకు మస్తు బెనిఫిట్స్!

ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది.

టీ, కాఫీ వంటి పానీయాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ జ్యూస్( Green Juice ) మాత్రం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్రతిరోజు ఈ గ్రీన్ జ్యూస్ తీసుకుంటే వెయిట్ లాస్ నుంచి హెల్తీ స్కిన్ వరకు మస్తు బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ గ్రీన్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకుని తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ స్లైసెస్, నిమ్మ పండు ముక్కలు మరియు రెండు రెబ్బలు కరివేపాకు ( Curry Leaves ) వేసుకోవాలి.

Advertisement

అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఉదయాన్నే సేవించాలి.ఈ గ్రీన్ జ్యూస్ ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా ఈ గ్రీన్ జ్యూస్ బాడీలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది.

డీటాక్స్( Detox ) చేయడమే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా మారుస్తుంది.అలాగే ఈ గ్రీన్ జ్యూస్ వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి ఉత్తమంగా సహాయపడుతుంది.

ఇది కేలరీలను వేగంగా బర్న్ అయ్యేలా చేస్తుంది.బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అంతేకాదు ప్రతిరోజు ఈ గ్రీన్ జ్యూస్ ను తాగడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా పనిచేస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది.

Advertisement

కీరా దోసకాయ, కరివేపాకు, నిమ్మ పండులో ఉండే పోషకాలు మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.

రక్తపోటును అదుపులో ఉంచుతాయి.కంటి చూపును సైతం చురుగ్గా మారుస్తాయి.

తాజా వార్తలు