నిరుపేద కుటుంబ వివాహానికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ గోలి మోహన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వట్టెంల గ్రామంలో నిరుపేద కుటుంబ వివాహానికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ గోలి మోహన్.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మా గ్రామంలో జరుగుతున్న నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం చేసినందుకు వట్టెముల గ్రామం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గ్రామ యువకులు మనోహర్ మాట్లాడుతూ ఎంతో మంది యువతకు దారి చూపుతున్న డాక్టర్ గోలి మోహన్ కి మా గ్రామ యువత తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలని ఆర్థికంగా ఎదగాలని మీరు చూపిస్తున్న మార్గం మాలాంటి ఎంతో మంది యువకులకు ఆదర్శప్రాయమైనదని అన్నారు.డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక సహాయం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అది చదువు గాని వివాహంగాని ఉద్యోగం గానీ అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారని ఇవన్నీ చూసిన నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను అర్థం చేసుకొని ఈ వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటిఅన్ని వర్గాల పేద ప్రజలకు అండగా ఉంటూ వారిని ఉన్నతమైన స్థితికి తీసుకపోవడానికి ముందుకు వస్తున్నానని, మనము ఆర్థికంగా ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని ఉద్యోగంలో ఉండాలని ఉన్నతమైన చదువులకు వెళ్లాలని ఈరోజు ఒక మహా సంకల్పంతో వేములవాడ నియోజకవర్గం లో పర్యటిస్తున్నానని అన్నారు.

ఎంతోమంది యువత ఈరోజు నాపై ఎన్నో ఆశలు పెట్టుకొని నేను చూపించే మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నారని దానికి నాకు సంతోషంగా ఉందని తెలిపారు.రాబోయే రోజుల్లో ఈ వేములవాడ నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి నేను ఎల్లవేళలా తోడ్పడుతానని రైతులను మహిళలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు డాక్టర్ గోలి మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

Latest Rajanna Sircilla News