ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్ యాక్సెస్ కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది.. చివరికి దిమ్మతిరిగే షాక్..?

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో (Bangalore Airport)ఒక పెద్ద స్కామ్‌ బయటపడింది.ఈ మోసంలో ఒక మహిళ చాలా నష్టపోయింది.

ఈమె తనతో క్రెడిట్ కార్డును తీసుకురాకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది.విమానం ఎక్కే ముందు లాంజ్‌లో కొంత సమయం గడపాలని అనుకుంది.

కానీ తనతో క్రెడిట్ కార్డు తీసుకు రాకపోవడంతో కార్డు ఫొటోను లాంజ్‌ స్టాఫ్‌కు చూపించింది.అప్పుడు స్టాఫ్, ఆ మహిళను ఒక యాప్ డౌన్‌లోడ్(Download app )చేసుకోమని, ఫేస్ స్కాన్ చేయించుకోమని అడిగారు.

భద్రత కోసం అని చెప్పడంతో ఆమె ఆ విధంగా చేసింది.కానీ తరువాత తన బ్యాంకు స్టేట్‌మెంట్ చూసినప్పుడు తన ఖాతా నుండి రూ.87,000 డిడక్ట్ అయినట్టు తెలుసుకుని షాక్ అయ్యింది.అసలేమైందంటే, ఆ మహిళ సెప్టెంబర్ 29న "లాంజ్‌ పాస్" (Lounge Pass)అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది.

Advertisement

కానీ లాంజ్‌ ఉపయోగించకుండా, విమానం ఎక్కే ముందు స్టార్‌బక్స్‌లో కాఫీ తాగింది.ఆమె ప్రయాణం ముగిసిన కొన్ని రోజుల తర్వాత, ఆమెకు మరో షాకింగ్ విషయం తెలిసింది.

ఆమె ఫోన్‌కు ఎవరూ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు(Calls, text messages) పంపించలేకపోతున్నారనే విషయం తెలుసుకుంది.ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఇలా జరిగిందని ఆమె భావించింది."కొన్ని నెలలుగా ఎయిర్‌టెల్(Airtel) సిగ్నల్ బాగా లేకపోవడంతో, ఇది సిగ్నల్ సమస్య అని నేను అనుకున్నాను.

ఆ తర్వాత ఒకరు నా ఫోన్‌ను ఎందుకు ఒక మగ వ్యక్తి రిసీవ్ చేస్తున్నాడని అడిగారు" అని ఆమె వైరల్‌గా మారిన వీడియోలో చెప్పింది.

ఈ ప్రశ్న కొంచెం వింతగా అనిపించినప్పటికీ, ఆమె ఆస్పత్రిలో తన కుటుంబ సమస్యతో బిజీగా ఉండటం వల్ల దీని గురించి ఎక్కువగా ఆలోచించలేదు.కొన్ని రోజుల తర్వాత, ఆమె క్రెడిట్ కార్డు నుంచి 87,000 రూపాయలకు పైగా డబ్బు కట్ అయి ఫోన్‌పే ఖాతాకు బదిలీ అయినట్లు తెలుసుకుని ఆమె షాక్ అయింది.ఆమె అనుమానం ప్రకారం, ఆమె డౌన్‌లోడ్ చేసుకున్న లాంజ్‌ పాస్ యాప్( Lounge Pass App) ద్వారా మోసగాళ్లు ఆమె ఫోన్‌లోకి ప్రవేశించారు.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?

ఆ తర్వాత, వారు ఫోన్ కాల్‌లను మరొక నెంబరుకు మళ్లించడం (కాల్ ఫార్వార్డింగ్) చేశారు.అంతేకాకుండా, ఆమె ఫోన్‌కు వచ్చే ఓటీపీలను కూడా వారు చూసి ఉండవచ్చు.

Advertisement

ఈ విధంగా వారు ఆమె బ్యాంకు ఖాతా నుండి అక్రమంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.

"వారు నన్ను లౌంజ్ పాస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని, స్క్రీన్ షేరింగ్ చేయమని అడిగారు.వారు నా ఫోన్‌లోకి ప్రవేశించి సెట్టింగ్‌లను మార్చారు.వారు కాల్ ఫార్వార్డింగ్ చేశారు, కాబట్టి నాకు ఏ కాల్స్ వచ్చినా నాకు తెలియలేదు.

వారు ఎన్ని ఓటీపీలను యాక్సెస్ చేసి ఉంటారో లేదా మరేమి చేసి ఉంటారో నాకు తెలియదు" అని ఆమె వివరించింది.ఈ సంఘటన గురించి ఆమె సైబర్ క్రైమ్(Lounge Pass App) విభాగంలో ఫిర్యాదు చేసింది.

అంతేకాకుండా, ఆమె బ్యాంకు (HDFC) కి కూడా సమాచారం ఇచ్చి తన కార్డును బ్లాక్ చేయించుకుంది.

తాజా వార్తలు