మూడు వారాలకే ఓటీటీలో ప్రత్యక్షమైన డబుల్ ఇస్మార్ట్.. ఇక్కడైనా హిట్టవుతుందా?

ఇటీవల ల కాలంలో థియేటర్ లలో విడుదల అయిన సినిమాలు కనీసం నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.

ఒకవేళ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే సినిమాలు నెల 2 నెలల లోపే ఓటీటీలకీ వచ్చేస్తున్నాయి.

స్టార్ హీరోల సినిమాలు సైతం విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలో దర్శనమిస్తుండడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.కాగా ఇటీవలే రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది.

ఈ సినిమా విడుదల అయినా 21 రోజులకే అమెజాన్ ప్రైమ్ లో అవుతోంది.నిజానికి ముందస్తు ప్రకటన ఇవ్వలేదు.సదరు ఓటిటి సాధారణంగా పాటించే ప్రమోషనల్ స్ట్రాటజీ వాడలేదు.హఠాత్తుగా ఊడిపడినట్టు ప్రైమ్ లో పెట్టేయడంతో తెల్లవారాక చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు.2024 అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన డబుల్ ఇస్మార్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్( Puri Jagannadh) కు కంబ్యాక్ మూవీ అవుతుందనుకుంటే మొన్నటి ఏడాది లైగర్ గాయాన్ని మరింత పెద్దది చేసింది.సుమారు నలభై కోట్ల దాకా నష్టాన్ని మిగిల్చిందని ట్రేడ్ టాక్ ఉంది.

Advertisement

దీన్ని పూడ్చే క్రమంలో కొంత పారితోషికాలు వెనక్కు ఇస్తారనే టాక్ ఉన్నప్పటికీ అదెంత వరకు నిజమో ఖరారుగా తెలియదు.అయితే పట్టుమని ఎక్కడా వారం రోజులు చెప్పుకోదగ్గ రన్ దక్కని డబుల్ ఇస్మార్ట్ కు మూడు వారాల గడువు ఎక్కువే అయినప్పటికీ ఓటీటీ విండో గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతున్న సమయంలోనే ఇలా జరగడం ట్విస్ట్.అయితే థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా కనీసం ఓటీటీలో అయినా ఒక మేరకు కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి మరి.

నేను చనిపోతే నా ఆస్తి మొత్తం వాళ్లకే.. బిగ్ బీ అమితాబ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు