సినిమా ఏదైనా పర్ఫామెన్స్ లో తగ్గేదేలే అంటున్న సత్యదేవ్ !

సినిమా ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో మంది నటీనటులు తెరంగేట్రం చేస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు.సినిమా ఎలా ఉన్నా కూడా తమ నటనతో పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా సీన్స్ నీ పండిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

అలా ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్దిమంది హీరోలలో సత్యదేవ్ కూడా ఒకడు.2011లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు సత్యదేవ్( Satya Dev ).దాదాపు అలా నాలుగేళ్ల పాటు చిన్న చిన్న పాత్రలో నటించిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి సినిమాతో చార్మి సరసన తొలిసారిగా లీడ్ రోల్ లో కనిపించాడు.అక్కడ నుంచి అతడి సినీ ప్రయాణం మొదలైంది అని చెప్పుకోవచ్చు.

జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత కూడా దాదాపు 25 చిత్రాల్లో సత్యదేవ్ కనిపించిన అందులో కొన్ని క్యామియో రోల్స్ ఉండగా మరికొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఉన్నాయి.అలాగే హీరోగా కూడా సత్యదేవ్ అనేక సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.

Dont Underestimate Hero Sathyadev ,satya Dev, Krishnamma, Tollywood , Ram Setu

అయితే విషయం ఏంటి అంటే హీరోగా అద్భుతమైన పర్ఫార్మర్ గా సత్యదేవ్ విషయంలో ఎలాంటి లోటు లేదు కానీ అతనిని సరిగ్గా వాడుకోవడంలోనే ఇండస్ట్రీ విఫలం అవుతూ వస్తుంది.నిజానికి సత్యదేవ్ చాలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు.అలాగే సినిమాలను తీసే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తున్నాడు.

కానీ దర్శకులే అతనిని సరిగా వాడుకోలేకపోతున్నారు.పర్ఫామెన్స్ ఎలాగైనా ఇచ్చి పడేయడం అతడికి అలవాటు.

Advertisement
Don't Underestimate Hero Sathyadev ,Satya Dev, Krishnamma, Tollywood , Ram Setu

అయినా కూడా సత్యదేవ్ కి ఇంకా మంచి సినిమాలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గత కొన్ని సినిమాల్లో వాటిని ప్రదర్శన చాలా బాగున్నప్పటికీ సినిమాలు విజయవంతం కావడం లేదు తాజాగా వచ్చిన కృష్ణమ్మ సినిమా( Krishnamma ) చూసుకుంటే సత్యదేవ్ నటనను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

Dont Underestimate Hero Sathyadev ,satya Dev, Krishnamma, Tollywood , Ram Setu

అలాగే అతడు నటించిన రామసేతు, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, బ్లఫ్ మాస్టర్ వంటి వాటిల్లో ఇచ్చి పడేశాడు.సినిమా విజయం పరాజయం అనేది ఏ నటుడి యొక్క కెరీర్ కి కొలమానం కాదు.అలా చూసుకుంటే సత్యదేవ్ నటనతో కంపేర్ చేస్తే ఈ సినిమాలన్నీ కూడా ఒక లెక్కే కాదు.

అలాగే నటుడిగా ఎదగాలని ఆసక్తితో విలన్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఏకంగా చిరంజీవికి గాడ్ ఫాదర్ సినిమా( Godfather)లో విధంగా నటించాడు అంటే సత్యదేవ్ నటన వ్యాల్యూ ఏంటో అందరు అర్థం చేసుకోవాలి.

రామ్ సేతు వంటి హిందీ సినిమా లో సైతం బాలీవుడ్ నటులతో పోటీపడ్డాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు