ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పండ్లు తిన‌డం అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

ప్ర‌తి మ‌హిళ‌కు ప్రెగ్నెన్సీ( Pregnancy ) అనేది ఒక గొప్ప అనుభూతి.ఆ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల ఆహార కోరిక‌లు మెద‌డులోకి వ‌స్తుంటాయి.

అయితే ప్రెగ్నెన్సీలో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి, క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌ల‌కు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.ఇప్పుడు చెప్ప‌బోయే పండ్లు ఆ కోవ‌కే చెందుతారు.

ప్రెగ్నెన్సీ టైమ్ లో త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన పండ్లు కొన్ని ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ‌.గ‌ర్భిణీ స్త్రీలకు అత్యంత మేలు చేసే పండు ఇది.దానిమ్మ‌లో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.విటమిన్ కె మ‌రియు కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Advertisement

శిశువు మెదడు అభివృద్ధికి తోడ్ప‌డ‌తాయి.చాలా మంది గ‌ర్భిణీలు ప్రెగ్నెన్సీలో త‌ర‌చూ నీర‌సం, అల‌స‌ట‌కు( boredom and fatigue ) గుర‌వుతుంటాయి.

ఆయా స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలో అర‌టిపండు హెల్ప్ చేస్తుంది.రోజుకొక అర‌టి పండు ( Banana fruit )తింటే నీర‌సం, అల‌స‌ట ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

జీర్ణక్రియ మెరుగవుతుంది.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య( Constipation problem ) దూరం అవుతుంది.

క‌మ‌లా ప్రెగ్నెన్సీ సమయంలో తిన‌ద‌గ్గ పండు.క‌మ‌లాపండులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుతుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఫోలేట్ శిశువు నర వ్యవస్థ అభివృద్ధికి సహాయం చేస్తుంది.

Advertisement

గ‌ర్భిణీ స్త్రీలు తినాల్సిన పండ్ల‌లో యాపిల్ ఒక‌టి( One apple ).యాపిల్ పండు గర్భంలో బరువు నియంత్రణకు సహాయపడుతుంది.అదేవిధంగా శరీరంలోని డిటాక్స్ ప్రక్రియకు స‌హ‌క‌రిస్తుంది.

బెర్రీ పండ్లు అన‌గా స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్ప్బెర్రీల‌ను( Strawberries, blueberries, raspberries ) తింటే గ‌ర్భిణీల‌కు చాలా మేలు చేస్తాయి.బెర్రీ పండ్లు యాంటీ ఆక్సిడెంట్ల‌కు గొప్ప మూలం.

ఇవి శరీరాన్ని రక్షించడంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా మ‌రియు కాంతివంతంగా మెరిపించ‌డంలో సహాయపడతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో త‌ప్ప‌క తినాల్సిన పండ్ల‌లో కివి కూడా ఒక‌టి.కివి పండ్ల ఖ‌రీదు ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.అందుకు త‌గ్గ పోష‌కాలు దానిలో నిండి ఉంటాయి.

కివి పండ్లు జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి.గ‌ర్భిణీల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఫోలేట్, విటమిన్ ఇ, మరియు సి వంటి పోషకాల‌ను స‌మృద్ధిగా అందిస్తాయి.

మ‌రియు గర్భసంచిని ఆరోగ్యంగా ఉంచుతాయి.అయితే మంచిద‌న్నారు క‌దా అని.పండ్ల‌ను అతిగా తింటే లేనిపోని స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.కాబ‌ట్టి రోజుకు రెండు ర‌కాల పండ్ల‌ను మితంగా తినండి.

అలాగే పండ్లు తినేముందు ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా క‌డ‌గండి.

తాజా వార్తలు