వైరల్: కుక్కతో పెట్టుకోవద్దురోయ్... బొడ్డుచుట్టూ 16 ఇంజెక్షన్లు చేయించుకోవాలి!

సోషల్ మీడియా వచ్చాక రకరకాల కంటెంట్ వీడియోల రూపంలో జనాల ముందు ప్రత్యక్షం అవుతోంది.

అందులో కొన్ని వీడియోలు సరదాగా అనిపిస్తే, కొన్ని సీరియస్ గా ఉంటాయి.

కొన్ని వీడియోలు ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి.కొన్ని విచిత్రంగా ఉంటే, మరికొన్నిటిని చూసినపుడు మాత్రం చాలా కోపం వస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది.అవును, కుక్కలు మనుషులకు నేస్తాలు.

వాటివలన ఉపయోగమే కానీ, నిరుపయోగం ఉండదు.వాటి జోలికి వెళ్తే గాని, అవి మనుషుల జోలికి పోవు.

Dont Keep It With The Dog.16 Injections Around The Belly Dog, Viral Latest, Ne
Advertisement
Don't Keep It With The Dog.16 Injections Around The Belly! Dog, Viral Latest, Ne

అలాంటి కుక్కతో పరాచికాలు ఆడితే ఎవరికన్నా కోపం వస్తుంది కదా.ఇక్కడ అదే జరిగింది.వైరల్ అవుతున్న వీడియోని చుస్తే ఓ కుక్క పిల్ల కాళ్లను ఓ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కలిసి చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టడం కనిపిస్తోంది.

కుక్కపిల్లను ఆ యువకుడు రెండు కాళ్లతో వేలాడదీస్తూ, గాలిలో తిప్పుతూ వికృతానందం పొందడం ఇందులో చూడవచ్చు.అక్కడితో ఆగకుండా వారు వెళ్లే మార్గంలో ఓ పెద్ద గోడ వెనుక కోతులు ఉంటే, వాటికి ఆ కుక్కపిల్లను చూపించి వాటిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Dont Keep It With The Dog.16 Injections Around The Belly Dog, Viral Latest, Ne

కాగా ఈ వీడియోను IAS అధికారి అవనీశ్‌ శరణ్‌ ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.వీళ్లలో మనుషులెవరో జంతువు ఎవరో మీరే చెప్పండి? అంటూ తను పోస్ట్‌కి క్యాప్షన్‌ పెట్టారు.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

కొందరు కుక్కపిల్లను హింసించినవారితోపాటు, ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.మరికొందరు స్పందిస్తూ.అనుమానమే లేదు.

Aloe vera : వాస్తు ప్రకారం కలబంద ఈ దిశలో నాటారంటే.. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది..!

ముగ్గురూ జంతువులే అంటూ కామెంట్‌ చేశారు.వేరొకరు స్పందిస్తూ.

Advertisement

కుక్కతో పెట్టుకోవద్దురోయ్.బొడ్డుచుట్టూ 16 ఇంజెక్షన్లు చేయించుకోవాలి! అంటూ వాళ్ళని హెచ్చరిస్తూ కామెంట్ చేసాడు.

తాజా వార్తలు