అధ్యక్షుడిగా ట్రంప్ .. ఈసారి భారతీయ వలసదారులకు కష్టమే : రాజా కృష్ణమూర్తి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఎన్నిక కావడంతో అక్కడ రాజకీయలు మారిపోతున్నాయి.

మరీ ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్( Immigration ) విధానంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని జనం బిక్కు బిక్కుమంటున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ విద్యార్ధులు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేనాటికి యూఎస్‌కి రావాల్సిందిగా పలు విశ్వవిద్యాలయాలు కోరుతున్నాయి.ఈ నేపథ్యంలో ట్రంప్ హయాంలో అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయ వలసదారులకు( Indian Immigrants ) పరిస్థితులు కఠినంగా ఉంటాయని భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ నేత, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamoorthi ) అన్నారు.

ఇల్లినాయిస్‌లోని 8వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా ఐదోసారి గెలిచిన కృష్ణమూర్తి వలసదారుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.

ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సామాన్యులు ముఖ్యంగా భారతీయులు సమస్యలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక విధానాన్ని ట్రంప్ సృష్టించారని రాజా కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు.

Advertisement

యూఎస్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీపై సెలెక్ట్ కమిటీలో ర్యాంకింగ్ మెంబర్‌గా రాజా కృష్ణమూర్తి పనిచేస్తున్నారు.ఈ కాంగ్రెస్ కమిటీకి నాయకత్వం వహించిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.అలాగే ఈక్వాలిటీ కాకస్‌కు వైస్ చైర్‌గా, కాంగ్రెషనల్ ఆసియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) ఇమ్మిగ్రేషన్ టాస్క్‌ఫోర్స్‌కు కో చైర్ గానూ రాజా కృష్ణమూర్తి వ్యవహరించారు.

కాగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ సరిహద్దు భద్రతపై( Border Security ) జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించాలని, అక్రమ వలసదారులను భారీగా బహిష్కరించడానికి యూఎస్ మిలటరీని ఉపయోగించాలని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యానించి కలకలం రేపారు.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ అంశం కీలకపాత్ర పోషించింది.ఈసారి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ విభాగానికి కో చైర్‌గా ఉన్న ట్రంప్ అనుచరుడు, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా అక్రమ వలసదారుల అణిచివేతకు మద్ధతు పలికిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు