నాలుగు మందారం ఆకులతో ఇలా చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది తెలుసా?

జుట్టు రాలడం( Hair Fall ) అనేది మనలో చాలా మంది అత్యంత కామన్ గా ఫేస్ చేసే సమస్య.

వివిధ కారణాల వల్ల హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది.

అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి మందారం ఆకులు( Hibiscus Leaves ) చాలా ఉత్తమంగా సహాయపడతాయి.మందార ఆకులు తలకు రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.మందార ఆకుల్లో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టును నిర్మించే కెరాటిన్( Keratin ) అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

మందార ఆకులు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.మరియు జుట్టు విరగకుండా చేస్తాయి.

Advertisement

నాలుగు మందారం ఆకులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.అందుకోసం ముందుగా నాలుగు మందారం ఆకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసుకున్న మందారం ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్,( Amla Powder ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) మరియు పావు కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా మందారం ఆకులతో హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

ముఖ్యంగా ఈ ప్యాక్ జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా నిరోధిస్తోంది.హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

మందార ఆకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చికాకుగా ఉన్న స్కాల్ప్‌ నుంచి ఉపశమనం అందిస్తాయి.చుండ్రు సమస్యను దూరం చేయడంలో కూడా ఈ హెయిర్ ప్యాక్ హెల్ప్ చేస్తుంది.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు