ఈ ఒక్కటి చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఒత్తుగా మారడం ఖాయం!

జుట్టు( Hair ) విపరీతంగా రాలుతుందా.? కుదుళ్ళు బలహీనంగా మారాయా.? చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుందా.

? కురులు పల్చగా తయారయ్యాయా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ ఒక్క రెమెడీని పాటిస్తే ఆయా సమస్యలన్నీ దూరం అవుతాయి.

మీ జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఒత్తుగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, ఐదు లవంగాలు వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna Powder ) ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ శీకాకాయ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు లెవెన్ జ్యూస్ మరియు తయారు చేసి పెట్టుకున్న టీ డికాక్షన్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి.మ‌రుసటి రోజు ఈ మిశ్రమంలో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.రెండు గంటల అనంతరం శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒక్కసారి కనుక చేస్తే జుట్టు రాలడం( Hairfall ) తగ్గుతుంది.

తెల్ల జుట్టుకు దూరంగా ఉండవచ్చు.జుట్టు కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.

అలాగే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.చుండ్రు ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే మాయం అవుతుంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

కాబట్టి జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఒత్తుగా మెరిసిపోతూ కనిపించాలంటే తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Advertisement

తాజా వార్తలు