సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు(Mosagallku Mosagadu) సినిమాని మే 31వ తేదీ తిరిగి విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినటువంటి వారిలో కృష్ణ సోదరుడు మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు (Adiseshagiri Rao) ఒక్కరు.
ఇక ఈ సినిమాని తిరిగి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.మహేష్ బాబు నమ్రత (Namrata) ప్రేమా పెళ్లి విషయంలో తన పాత్ర ఉందని చాలామంది అనుకుంటున్నారు.నిజానికి మహేష్ బాబు నమ్రత వివాహం జరగడానికి కారణం తన తల్లి ఇందిరా దేవి (Indira Devi)అని తెలిపారు.
నేను కేవలం మహేష్ నటించిన వంశీ (Vamshi) సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నమ్రతను హీరోయిన్ గా సెలెక్ట్ చేశానని ఈయన తెలియచేశారు.
ఇక మహేష్ బాబు చిన్నప్పటినుంచి తనకు బాగా తెలుసు అని,తాను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అంటూ ఈ సందర్భంగా మహేష్ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తన బాబాయ్ ఆదిశేషగిరిరావు తెలియజేశారు.మహేష్ బాబు ఎవరినైనా ఇట్టే ఇమిటేట్ చేస్తారు.తనలో ఉన్న టాలెంట్ చూసి పెద్దయ్యాక గొప్ప స్టార్ అవుతారని ఆరోజే భావించాను.
మహేష్ బాబుకు చాలా టాలెంట్ ఉందని ఆదిశేషగిరిరావు తెలియజేశారు.ఇక 14 సంవత్సరాల వయసులోనే మహేష్ బాబు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుతూ పోలీసుల కంటపడ్డారు దీంతో పోలీసులు ఆపిన ఆగకుండా కారు నేరుగా వచ్చి ఆఫీసులో పెట్టి తనకు ఏమీ తెలియనట్టు కూర్చున్నారని అనంతరం తానే పోలీసులకు ఏదో సర్ధి చెప్పి పంపించాను అంటూ ఆదిశేషగిరిరావు మహేష్ బాబు గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy