' కోటంరెడ్డి ' కి  టీడీపీ లో ఛాన్స్ లేనట్టేనా ? 

రాజకీయాల్లో ఎప్పుడూ ఏ నేత పరిస్థితి తలకిందులు అవుతుందో చెప్పలేం.తాను ఒకటి తలిస్తే.

పరిస్థితులు మరోలా తలిస్తే పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుంది.ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

అధికార పార్టీ వైసీపీ నుంచి గెలిచిన శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఆరోపిస్తూ.ఆ పార్టీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ బయటకు వచ్చారు.

గతంలోని ఆయన ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ,  ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేయడంతో వైసిపి అధిష్టానం ఆయనను బుజ్జగించింది.ఇక ఆ తరువాత ఆయన అదే రకమైన అసంతృప్తితో విమర్శలు చేయడంతో,  ఆయనపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.

Advertisement

వెంటనే నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది.రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

ఈ ప్రకటన టిడిపిలో పెద్ద ఆందోళనకు కారణం అయింది.ఈ జిల్లాకు చెందిన టిడిపి కీలక నేతలంతా శ్రీధర్ రెడ్డి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీధర్ రెడ్డిని టిడిపిలో చేర్చుకోవద్దంటూ అధినేతకే తేల్చి చెప్పారు.ముఖ్యంగా టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు, జిల్లాలోని టిడిపి కీలక నాయకులంతా శ్రీధర్ రెడ్డి పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఒకవేళ ఆయనను టిడిపిలో చేర్చుకున్నా,  గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదంటూ చంద్రబాబు వద్ద తేల్చి చెప్పారట.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అంతే కాదు ఆయన వైసీపీలో ఉండగా , టిడిపి కార్యకర్తలని, నాయకులని అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారని,  ఇప్పుడు అటువంటి నేతని పార్టీలోకి తీసుకోవడం సరికాదంటూ జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబుకు తేల్చి చెప్పారట.అంతేకాదు ఆయనను టిడిపిలో చేర్చుకుంటే పార్టీని వీడి వెళ్లేందుకు చాలా మంది నేతలు సిద్ధమవుతుండడం తదితర కారణాలతో,  చంద్రబాబు కూడా ఈ విషయంలో ఆలోచనలో పడ్డారట.టిడిపిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరినా కొత్తగా వచ్చే లాభమేమి ఉండదని , గత నాలుగేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను ఇబ్బందులు పెట్టిన శ్రీధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం సరికాదు అంటూ వస్తున్న సూచనలు చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నారట.

Advertisement

దీంతో ఆయనను టిడిపిలో చేర్చుకునే విషయంలో బాబు అంతగా ఆసక్తి చూపించడం లేదట.ఎంతోమంది ఇతర పార్టీల నుంచి టిడిపిలోకి వస్తున్న నాయకులకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ , పార్టీ కండువాలు కప్పుతున్న చంద్రబాబు ఒక ఎమ్మెల్యే పార్టీలోకి వస్తానన్నా సరే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.దీంతో ఇప్పుడు శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది.

అటు వైసిపి నుంచి బయటకు రావడం,  టిడిపిలో చేరాలని చూస్తున్న జిల్లా నేతలు అడ్డుపడుతూ ఉండడం వంటివే కాకుండా,  జనసేనలో కూడా తనుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో,  ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి ఉన్నారట.ఇక ఆయనకు ఉన్న ఆప్షన్ బి ఆర్ ఎస్ మాత్రమే అన్నది నెల్లూరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

తాజా వార్తలు