జున్ను తింటే బరువు పెరుగుతారా.. అసలు నిజం ఇదే!

జున్ను..

( Cheese ) ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల్లో జున్ను ఒకటి.

పిల్లల నుంచి పెద్దల వరకు జున్నును చాలా ఇష్టంగా తింటుంటారు.అయితే జున్ను తినడం వల్ల బరువు పెరుగుతామని ఎక్కువ శాతం మంది భావిస్తుంటారు.

ఈ కారణంతో కొందరు జున్నును ఎవైడ్ కూడా చేస్తుంటారు.కానీ అసలు నిజం ఏంటంటే.

Advertisement

జున్ను తింటే బరువు పెరగరు తగ్గుతారు.అవును మీరు విన్నది అక్షరాలా నిజం.

నిపుణులు పలు పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.నిత్యం లిమిట్ గా జున్నును తీసుకుంటే శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.అతి ఆకలి దూరం అవుతుంది.

చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.శరీరంలో కొవ్వు నియంత్రణలో ఉంటుంది.

క్యాలరీలు సైతం చాలా త్వరగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ ( Weight loss )అవుతారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

కాబట్టి ఇకపై జున్ను తింటే బరువు పెరుగుతామన్న అపోహతో పొరపాటున కూడా దాన్ని దూరం పెట్టకండి.

Advertisement

పైగా జున్నును నిత్యం తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.జున్ను తినడం వల్ల ఎముకలు కండరాలు పుష్టిగా మారతాయి.జున్నులో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

కాబట్టి దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి ( Immunity )పెరుగుతుంది.ఏజింగ్ ప్రక్రియను అడ్డుకునే శక్తి జున్నుకు ఉంది.

జున్ను డైట్ లో ఉంటే మీ చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.మడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

అంతేకాదు, జున్నులో విటమిన్ డి దొరుకుతుంది.ఇటీవల రోజుల్లో ఎంతో మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.

అలాంటివారు నిత్యం జున్ను తీసుకుంటే విటమిన్ డి( Vitamin D ) కొరత దూరం అవుతుంది.జున్ను మెదడు( Brain ) పనితీరును సైతం మెరుగుపరుస్తుంది.

ఆలోచన శక్తిని రెట్టింపు చేస్తుంది.

తాజా వార్తలు