బాబుపై బిజెపికి ఆ స్థాయిలో కోపం ఉందా?

మామూలుగా తనకు బలం లేనిచోట్ల ఆయా రాష్ట్రాలలో నెంబర్ టు గా ఉన్న పార్టీలతో జట్టు కట్టడానికి సహజంగా బిజెపి ప్రయారిటీ ఇస్తుంది.

తరువాత ఆ పార్టీ ని క్రమం గా బలహీన పరుస్తూ తాను ప్రత్యామ్నాయంగా అవతరించడం బిజెపి ( BJP )మార్క్ స్ట్రాటజీ.

అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుంది.ముఖ్యంగా అక్కడ అధికార పార్టీ వైసీపీ( YCP )తో లోపాయికారి స్నేహం నెరుపుతుంది .

Does Bjp Have That Level Of Anger Against Babu, 2024 Elections , Bjp, Tdp, Par

సిద్ధాంతాల రీత్యా రెండు వేరువేరు భావజాలాలకు ప్రతినిధులుగా ఉన్న వైసిపి భాజాపా ల మధ్య ఈ స్థాయి స్నేహం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.అయితే జనసేన ఎంట్రీ తర్వాత కేంద్ర బిజెపి మనసు మారుతుందని మెల్లగా అది తెలుగుదేశం జనసేన కూటమిలో చేరుతుందని ఆదిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి అంటూ ఆ మధ్య వరకు తెలుగుదేశం అనుకూలం మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే తెలంగాణ ఎన్నికలలో జనసేన తో పొత్తు పెట్టుకుంటునట్టు ప్రకటించిన బిజీపీ జనసేన కన్నా ఎక్కువ ఓటింగ్ ఉన్న తెలుగు దేశాన్ని అసలు పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి తెలుగుదేశం పట్ల ఏ స్థాయిలో విముఖత ఉందో అర్థమవుతుంది.

Does Bjp Have That Level Of Anger Against Babu, 2024 Elections , Bjp, Tdp, Par

నిజంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తుపై ప్రాధమికం గా ఆ పార్టీలో అంగీకారం ఉన్నా కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏదో విధంగా బిజెపి ఉపయోగించుకుని ఉండేది.అయితే ఇప్పటివరకు తెలంగాణలో పోటీ చేయని జనసేన( Jana sena ) పట్ల మొగ్గు చూపుతోందే తప్ప టిడిపిని కనీసం నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు.తద్వారా టిడిపి పట్ల తమ స్టాండ్ ఏమిటో బిజెపి చెప్పకనే చెప్పినట్లు అయింది.

Advertisement
Does BJP Have That Level Of Anger Against Babu, 2024 Elections , BJP, Tdp, Par

ఇక వచ్చే ఎన్నికలలో తెలుగుదేశానికి జనసేన మరియు వామపక్షాలతో కూటమి ఏర్పాటు చేసుకోవటమే ఏకైక ఆప్షనుగా ఉంది.బిజెపి కూటమి లో ఎంటర్ అవ్వకపోతే తాను జాయిన్ అవ్వడానికి కమ్యూనిస్టులకు కూడా పెద్దగా అభ్యంతరం ఉండదు .దాంతో 2024 ఎన్నికలలో( 2024 elections ) ఈ మూడు పార్టీల కూటమే ఫైనల్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు