డేటింగ్ యాప్ ట్రాప్ లో పడి కోటిన్నర పోగొట్టుకున్న వైద్యుడు.. పాపం!

డేటింగ్ యాప్ ల పేరుతో చేస్తున్న మోసాల గురించి తరచూ వార్తలు వింటూనే ఉన్నాం.

అయినా వీరి ట్రాప్ లో పడి రోజూ వందలాది మంది మోస పోతూనే ఉన్నారు.

తాజాగా ఓ వైద్యుడు డేటింగ్ యాప్ ల మోజులో పడి ఇలాగే మోస పోయాడు.వేలు కాదు.లక్షలు కాదు.

ఏకంగా కోటిన్నర రూపాయలు పోగొట్టుకున్నాడు.జిగోలో డేటింగ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఆ వైద్యుడు.అందులో అందమైన యువతుల కోసం సెర్చ్ చేశాడు.

ఫైనల్ గా ఓ యువతి ఈ 60 ఏళ్ల వైద్యుడిని యాక్సెప్ట్ చేసింది.ఆమె ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు పంపించాడు.

Advertisement

వైద్యుడి వీక్ నెస్ తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు అమ్మాయి ముసుగులో ఆయన నుండి విడతల వారీగా కోటిన్నర రూపాయలు కాజేశారు.చివరకు మోసపోయానని గ్రహించిన ఆ వైద్యుడు పోలీసులు ఆశ్రయించాడు.

పోలీసుల వద్దకు వెళ్లిన ఆ వైద్యుడిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.ఎందుకంటే.

ఇంతకు ముందు కూడా ఇలాగే మోసపోయిన ఘటనలో అతనికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.మరో సారు అచ్చంగా అలాగే మోస పోయాడని పోలీసులు తెలిపారు.

విద్యావంతులు, ఉన్నత వృత్తుల్లో ఉన్న వాళ్లే ఇలా మోసపోతే నిరక్షరాస్యుల పరిస్థితి ఏమిటని వారు అంటున్నారు.డేటింగ్ యాప్స్ లో అమ్మాయిల ప్రొఫైల్స్ పెట్టి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 26, మంగళవారం, 2022

వారి ఫోటోలతో మాయ చేస్తారు.వారి కాంటాక్ట్ నంబర్ చూడాలన్నా.

Advertisement

వారి వివరాలు తెలుసుకోవాలన్నా.చాట్ చేయాలన్నా.

రిజిస్ట్రేషన్ కోసం కొంత మొత్తం చెల్లించాల్సిందే.అమ్మాయిలతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి.

వారితో ఫోన్ లు మాట్లాడించి ఇలా మోసాలకు పాల్పడుతున్నారు.

తాజా వార్తలు