బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!

ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటోలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )అలాగే మంచు విష్ణు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా, ఈ పిల్లాడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇందులో ఉన్న ఈ పిల్లాడు ప్రస్తుతం యాక్టర్ గా మారాడు.

సినిమాలు వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ అబ్బాయి మహేశ్ బాబు, రవితేజ, బాలకృష్ణ తదితర టాప్ హీరోల సినిమాల్లో నటించాడు.ఇంకా అర్థం కాలేదా ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు మరెవరో కాదు నటుడు మానస్.

Do You Remember The Actor Next To Allu Arjun And Manchu Vishnu In This Photo He

ప్రస్తుతం బుల్లితెరపై చాలా సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు మానస్.ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా నటిస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు.

అయితే మానస్( Manas ) మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.బాల నటుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన మానస్, హీరోగా విలన్ గా నటిస్తూనే బుల్లి తెరపై కోయిలమ్మ సీరియల్ ( Koilamma serial )తో అడుగు పెట్టాడు.

Advertisement
Do You Remember The Actor Next To Allu Arjun And Manchu Vishnu In This Photo He

నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Do You Remember The Actor Next To Allu Arjun And Manchu Vishnu In This Photo He

బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నరసింహనాయుడు లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.ఇక చిన్న పిల్లలతో తెరకెక్కించిన హీరో మానస్ నటనకు గాను ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు ను సొంతం చేసుకున్నాడు.ఇక బ్రహ్మముడి సీరియల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పండుగ ఈవెంట్లు షోస్ లో పాల్గొంటూ తన డాన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు.అప్పుడప్పుడు డాన్స్ వీడియో సాంగ్ లు కూడా చేస్తూ ఉంటారు మానస్.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు