గుడికి తడిబట్టలతో ఎందుకు వెళ్లకూడదో మీకు తెలుసా?

మన భారత దేశంలో దేవాలయాలకు వున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.ముఖ్యంగా ఆచార వ్యవహారాలకు హిందూ దేవాలయాలు పెట్టింది పేరు.

గుడికి ఎలా వెళ్ళాలి? ఎలాంటి బట్టలు కట్టుకోవాలి? వెళ్ళిన తర్వాత ఎలాంటి పూజలు చేయాలి? వంటి విషయాలు మనవాళ్ళు కాస్త సీరియస్ గానే తీసుకుంటారు.ఈ క్రమంలోనే దేవాలయాలకు తడి బట్టలతో వెళ్ళకూడదు అనే ఓ నియమం ఉంది.

ఇపుడు దాని గురించి తెలుసుకుందాం.తడి బట్టలతో ఎటువంటి దైవ కార్యాలు చెయ్యకూడదు అనేది మన పూర్వీకులనుండి వస్తున్న ఓ నియమం.

పితృ కార్యాలు మాత్రమే తడి బట్టలతో చెయ్యాలని మన హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి.దైవ సంబంధిత కార్యాలు ఏది చేసినా సరే పొడి బట్టలతోనే చెయ్యాలి అనేది గట్టి నియమం.

Advertisement
Do You Know Why You Should Not Go To Temple In Wet Clothes , Temple,wet Clothes

ఇంట్లో అయితే తడిపి అరవేసిన బట్ట వేసుకుని, పూజ వంటివి చేయవచ్చని కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.ఇక గుడికి వెళ్ళేటప్పుడు మగవారు కాటన్ పంచ, ఆడవారు అడ్డకచ్చ చీర కట్టుకుని వెళ్ళాలని పెద్దలు చెప్తూ ఉంటారు.

మనం కూడా ఈ నియమాన్ని తూచా పాటిస్తాము.

Do You Know Why You Should Not Go To Temple In Wet Clothes , Temple,wet Clothes

అయితే కాని నేటి పరిస్థితులలో అది కాస్త రివర్స్ అయింది.చాలా మంది, దేవాలయాలు దగ్గర ఉండే కోనేటిలో స్నానం చేసి, ఆ బట్టలతోనే నీళ్ళు ఓడుతు దర్శనాలు చేసుకోడం, పొర్లు దండాలు పెట్టడం వంటివి చేస్తున్నారు.ఆ కార్యక్రమం ఎంత మాత్రం మంచిది కాదని పురోహితులు చెబుతున్నారు.

మనం వేసుకున్న బట్టలు తడిపి, పిండకుండా నీళ్ళు ఓడుతు ఆరవేసినా, మనం కూడ అలా నీళ్ళు ఒడుతున్న బట్టలు వేసుకుని ఉన్నా మంచిది కాదు.ఆ బట్ట నుండి కారుతున్న నీరు పితరులకు ఇస్తున్నట్టు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఈ పని కారణంగా దైవాగ్రహానికి గురవుతాము అని పురోహితులు చెబుతున్నారు.కాబట్టి ఇకనుండి ఇలా ఎవరైనా చేసినట్లయితే ఈ విషయాన్ని గ్రహించగలరని మనవి.

Advertisement

తాజా వార్తలు