ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు ఎందుకో తెలుసా?

మానవుని శాస్త్ర జ్ఞానము పెద్దగా అభివృద్ధి చెందని రోజుల్లో ఋషులు, మునులు ఎన్నో అరోగ్య సూత్రాలను రూపొందించారు.

వైద్య రంగము అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో శుచి, శుబ్రత, వ్యాధినిరోదకత దైవకార్యాలరూపములో ఉండేవి.

ఎందుకంటే ఆ ఆరోగ్య సూత్రాలను పుణ్యము, పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు అనుసరిస్తారని ఆలా నియమాలు పెట్టారు.ఇలా చేస్తే ఆరోగ్యం, ఆలా చేస్తే అనారోగ్యం అని చెప్పితే చాదస్తంగా కొట్టిపారేసారు.

కానీ ఆలా చెప్పే వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.వాటిలో ఒకటైన నియమాన్ని గురించి తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేవగానే ముందుగా రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలో్ని ఉష్ణశక్తి, వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై కళ్ళు ఆరోగ్యంగా, తేజోవంతంగా ఉంటాయి.ఇలా చేయటం వలన కళ్ళ సమస్యలు రావు.

Advertisement

ఒకవేళ ఉన్నా అవి తొందరగా తగ్గుముఖం పడతాయి.

ఇది ఆరోగ్యపరమైన లాభం.అయితే ఈ విషయం గురించి మన ఋషులు ఏమి చెప్పారంటే.చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలు అనుకోకుండ చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితము ఉంటుందని , బ్రహ్మజ్ఞానము కలుగుతుందని .అలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము వస్తుందని చెప్పారు.ఇలా చేయటం వలన ఒక పక్క ఆరోగ్యం మరో పక్క పుణ్య ఫలం వస్తుంది.

Advertisement

తాజా వార్తలు