స్మార్ట్ ఫోన్లు సడన్ గా ఎందుకు పేలుతాయో తెలుసా..?

మనం స్మార్ట్ ఫోన్లు( Smart phones ) పేలడం గురించి అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూనే ఉంటాం.

స్మార్ట్ ఫోన్లు సడన్ గా పేలడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

కాస్త ఆ జాగ్రత్తగా ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.స్మార్ట్ ఫోన్లు పేరడానికి ముఖ్య కారణం బ్యాటరీ( Battery ) సమస్యలు.

కఠినమైన భద్రత పరీక్షలతో తయారైన బ్యాటరీలు పేలుతూ ప్రజల ప్రాణాలను బలి తీస్తున్నాయి.ఇటీవలే కేరళలో స్మార్ట్ ఫోన్ పేలడంతో ఓ 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే స్మార్ట్ ఫోన్లు పేలడానికి తయారీ కంపెనీలు మాత్రమే కారణం కాదు.మన ఆజాగ్రత్త అని కూడా గుర్తుంచుకోవాలి.

Do You Know Why Smart Phones Explode Suddenly , Smart Phones, Explode Suddenly,
Advertisement
Do You Know Why Smart Phones Explode Suddenly , Smart Phones, Explode Suddenly,

ఫోన్లలో ఉండే బ్యాటరీలు అన్ని లియాన్( Leon ) తో రూపొందించబడి ఉంటాయి.ఇవి కెమికల్ బ్యాలెన్స్ ను కలిగి ఉంటాయి.కాబట్టి వీటి దగ్గర వేడి విపరీతంగా పెరిగినప్పుడు, బ్యాటరీ కేసింగ్ దెబ్బతిన్నప్పుడు స్మార్ట్ ఫోన్ పేలే అవకాశాలు ఉంటాయి.

మొబైల్ ఫోన్లో ఉండే బ్యాటరీ హిట్ పెరిగితే చాలా ప్రమాదకరం.అంతేకాకుండా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఫోన్ చార్జింగ్ పెట్టకూడదు.రాత్రిపూట చార్జింగ్ పెట్టి, ఉదయం వరకు అలాగే వదిలేస్తే చాలా ప్రమాదకరం.ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఫోన్ చార్జింగ్ లో పెట్టి ఫోన్ కాల్స్ మాట్లాడడం, ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల తొందరగా బ్యాటరీ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది.

Do You Know Why Smart Phones Explode Suddenly , Smart Phones, Explode Suddenly,

చార్జింగ్ ఫుల్ అయినా కూడా తీసేయకుండా అలాగే ఉంచితే బ్యాటరీ హీట్ ఎక్కి ఉబ్బిపోతుంది.ఉబ్బిపోయిన బ్యాటరీలు ఎప్పుడు పేలతాయో చెప్పలేము.కాబట్టి స్మార్ట్ ఫోన్ లో ఉండే బ్యాటరీలు ఉబ్బి ఉంటే వెంటనే వాటిని మార్చేయాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

కొన్ని స్మార్ట్ ఫోన్లు చేజారి కింద పడితే దెబ్బతిని ఉబ్బుతాయి.ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

Advertisement

ఇంకో ముఖ్య కారణం ఏమంటే ఫోన్ కు సంబంధించిన కంపెనీ చార్జర్ మాత్రమే ఉపయోగించాలి.తద్వారా బ్యాటరీ దెబ్బతినకుండా ఉంటుంది.

ఫోన్ బ్యాటరీ డిజైన్ చేసిన దానికంటే ఎక్కువ ఓల్టేజ్ తో చార్జ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది.కాబట్టి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ సూచనలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.

తాజా వార్తలు