మహాశివరాత్రి రోజు చేసే రుద్రాభిషేకానికి అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా..

ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పవిత్రమైన పండుగను ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తేదీన జరుపుకుంటారు.

మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ఆరాధించడం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.శివపురాణంలో మహాదేవుని పూజించడానికి కొన్ని తేదీలు చాలా ప్రత్యేకమైనవి గా భావిస్తారు.

అటువంటి వాటిలో మహాశివరాత్రి కూడా ఒకటి.హిందూమతంలో మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ గా భావిస్తారు.

ఈ రోజున శివుడి పార్వతి దేవి ల వివాహం జరిగింది.మహా శివరాత్రి రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

Advertisement

పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భక్తులు ఉపవాసం పాటిస్తారు.మహాశివరాత్రి సందర్భంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి, తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, రుద్రాభిషేకం కూడా చేస్తారు.

రుద్రాభిషేకంతో శివుడు చాలా సంతోషిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.రుద్రాభిషేకం అంటే ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రుద్ర ,అభిషేకం అనే రెండు పదాల్లో రుద్రుడు, శివుని స్వరూపం.ఇందులో అభిషేక్ అంటే స్నానం చేయడం.రుద్రాభిషేకం అంటే శివుని రుద్ర రూపాన్ని అభిషేకించడం అని అర్థం వస్తుంది.

శివుడి రుద్రాభిషేకం చేయడం ద్వారా శివుడు ప్రతి ఒక్కరి కోరికలను తీరుస్తాడని దీనితో పాటు ఇది గ్రహ దోషాలు, వ్యాధులు, బాధలు పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అదృష్టాన్ని తెచ్చే దేవుడు ముందు దీపం వెలిగించడానికి.. ఈ నియమాలు పాటించండి..!

రుద్రాభిషేక మహిమ శివపురాణంలో కూడా తెలిపారు.మీకు ఏమైన కోరిక ఉంటే భక్తితో రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.శివ లింగంలో శివుని ఉనికిని చూడడం చాలా ముఖ్యం.

Advertisement

శివలింగంలోని శివుని నివాసాన్ని చూడకుండా రుద్రాభిషేకం చేయకూడదని శివ పురాణం లో ఉంది.ఫాల్గుణ మాసంలోని మహాశివరాత్రి, ప్రదోష, సోమవారాలలో శివుడు భూమిపై ఉన్న అన్ని శివలింగాల్లో ఉంటాడని వేద పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు