హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడో తెలుసా..?

హనుమంతుడు( Hanuman ) సంకట మోచునుడు.ఆయన భక్తికి అంకిత భావానికి ప్రతీక ఆంజనేయుడు.

అయితే ఆయన తన భక్తులను కష్టాల నుండి వెనక్కి గట్టెక్కిస్తాడని ఒక నమ్మకం.పవనపుత్ర హనుమాన్ ను పూజించేందుకు ఎప్పుడు కూడా సింధూరాన్ని( Vermilion ) వాడుతారు.

అయితే జ్యోతిష్యంలో హనుమంతుడికి చేసే సింధూర పూజకు చాలా ప్రాశస్త్యం ఉంది.అయితే కేసరి రంగులో ఉండే సింధూరాన్ని హనుమంతుడికి సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయి అని మన శాస్త్రం చెబుతోంది.

అయితే సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక తాము కోరుకున్న ప్రతిఫలం దక్కుతుందని ఒక నమ్మకం.ఎందుకంటే సింధూరంతో హనుమాన్ కు పూజ చేస్తే ఆయనను ప్రసన్నుడను చేస్తుంది.

Advertisement

ఈ విధంగా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది.ఎందుకంటే సింధూరంతో హనుమంతుడు కరుణిస్తాడు.

అలాగే మనము కోరిన కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు.

ముఖ్యంగా మంగళవారం నాడు హనుమంతుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది.అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.రామభక్త అయిన హనుమంతుడికి సింధూరం సమర్పించడం వలన వెనక ఒక పౌరాణిక కథ ప్రాచుర్యంలో ఉంది.

హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు వెళ్ళిన సందర్భంలో అశోకవనంలో సీతను( Sita in Ashokavanam ) కనిపెట్టిన తర్వాత దూరం నుంచి సీతాదేవిని చాలా సమయం పాటు గమనిస్తూ ఉంటాడు.అయితే ఆమె ప్రతిరోజు అనునిత్యం తన పాపిటల్లో సింధూరం ధరించడాన్ని గమనిస్తాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
శరత్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం

అలాగే రావణుడు రావడం, సీతను బెదిరించడం లాంటి అన్ని గట్టాల తర్వాత తనను తాను రాము బంటుగా సీతకు పరిచయం చేసుకుంటాడు.

Advertisement

ఇక ఈ సందర్భంలో సీతాదేవిని సింధూరం గురించి అడుగుతాడు.అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడి ( Sri Ramachandra )దీర్ఘాయు కోసం తాను సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని, అంతేకాకుండా ఇది శ్రీరాముడికి చాలా ఇష్టమని, దీన్ని ధరించిన తన ముఖాన్ని చూసి శ్రీరాముడి ముఖంలో ఎంతో ప్రసన్నత తాను గమనిస్తుందని, అందుకే ఆయనకు నచ్చిన విధంగా ఉండేందుకు ఆమె సింధూరాన్ని ప్రతినిత్యం ధరిస్తుందని సమాధానం చెప్పిందట.అయితే ఈ కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువును ఇస్తే తాను తనువంత సింధూరం ధరిస్తే రాముడికి మృతువే ఉండదని, చిటికెడు సింధూరం నుదుట ధరించిన సీతనే అంతట శ్రీరాముడు అంత ప్రేమిస్తే, తనను ఇంకెంత ప్రేమిస్తాడో కదా అన్న భావనతో అప్పటినుంచి హనుమంతుడు ఒళ్లంతా సింధూరం ధరిస్తాడనీ ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

తాజా వార్తలు