గణపతి బప్పా మోరియా అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

మనదేశంలో ప్రజలు సెప్టెంబర్ 18 వ తేదీన వినాయక చవితి( Ganesh Chaturthi ) పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

అలాగే వినాయకుని పూజ లేనిదే ఏ శుభకార్యము మొదలుపెట్టారు.

అలాంటి ఎన్నో ప్రత్యేకతలు వినాయకుని లో ఉన్నాయి.మహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షస రాజు పాలించేవాడు.అతని భార్య ఉగ్రకు పిల్లలు లేనందున శౌనక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాని గర్భవతి అయింది.

సూర్యుడి లాంటి వేడితో పిల్లవాడు జన్మించడం వల్ల అతడిని సముద్రంలో పడేశారు.

Advertisement

సముద్రంలో దొరకడం వల్ల ఆ పిల్లాడిని సముద్రా లేదా సింధూరసుడు అని పిలుస్తారు.సింధూరసుడు సుదీర్ఘకాలం తపస్సు చేస్తాడు.తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదిస్తాడు.

అది ఉన్నంతకాలం సింధూరసుడు మృత్యుభయం ఉండదు.ఈ ధైర్యంతో సింధూరసుడు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని అనుకుంటాడు.

దేవతల పై, కైలాసం పై, వైకుంఠం పై దండెత్తి దాడి చేశాడు.అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు.

మహావిష్ణువు( Mahavishnu )ను కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధూరసురుడు ప్రకటిస్తాడు.దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇస్తాడు.

పరగడుపున ఈ పండును తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు..!

అప్పుడు వినాయకుడు తను పార్వతి దేవి( Parvati devi )కి కుమారుడిగా జన్మించి సింధూరసుడిని హతం చేస్తానని మాట ఇస్తాడు.12 సంవత్సరాల పాటు మేరు పర్వతంపై గణేశుడి( Ganesh ) మంత్రం జపిస్తారు.అలా భాద్రపద శుద్ధ చతుర్థి రోజు గణపతి పార్వతికి కొడుకుగాజన్మించి సింధూరసురుడి పై బాణం వేసి ఉదారం చీల్చుతాడు.

Advertisement

అప్పుడు సింధూరసురుడి ఉదారంలోని అమృతం బయటకు వచ్చి అతడు మరణిస్తాడు.దేవతలు ఆనందంతో గణపతిని పూజించడం మొదలుపెడతారు.అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రం గా వర్ధిల్లుతుంది.

మోర్ అనే అంటే నెమలి అని అర్థం వస్తుంది.యుద్ధానికి నెమలి వాహనం వేసుకొని వచ్చి సింధూరసుడిని హతం చేశాడు.

కాబట్టి అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో గణపతి బప్పా మోరియా అని భక్తులు కొలుస్తూ ఉంటారు.అది క్రమంగా దేశమంతటా వ్యాపించి గణపతి బప్పా మోరియాగా భక్తులు పిలవడం మొదలుపెట్టారు.

తాజా వార్తలు