చంద్రగ్రహణం సమయంలో ఆహార పదార్థాల పై.. దర్బాలను ఎందుకు ఉంచుతారో తెలుసా..?

అక్టోబర్ నెలలో ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం( Iunar eclipse ) ఏర్పడింది.

అక్టోబర్ 28,29వ తేదీల మధ్య అర్ధరాత్రి ఒకటి ఆరు నిమిషముల నుంచి రెండు గంటల 24 నిమిషముల వరకు చంద్రగ్రహణం ఏర్పడింది.

ఈ చంద్రగ్రహణం భారతదేశం, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో కనిపించింది.ఈ సారి ఏర్పడిన ఈ చంద్రగ్రహణం పాక్షిక చంద్ర గ్రహణంగా చెబుతున్నారు.

ఈ సారి ఏర్పడిన చంద్రగ్రహణం రాహు గ్రస్త చంద్రగ్రహణం కావడంతో సుతక కాలాన్ని పాటించాలని పండితులు చెప్పారు.అయితే చంద్రగ్రహణం సమయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు.

ముఖ్యంగా గర్భిణీలు కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు( Scholars ) సూచించారు.గ్రహణాలు ఏవైనా మానవ జీవితం మీద ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తాయని, గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వెల్లడించారు.అలాగే గ్రహణ సమయంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో భూమి మీద పడే కిరణాలు శరీరం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని,అందుకే గ్రహణాల సమయంలో ఎవరు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని వెల్లడించారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే చాలా మంది గ్రహణ సమయంలో ఆహారం పై దర్భలను వేయడం చూస్తూనే ఉంటాము.ఎందుకు అలా చేస్తారు అంటే గరికను వేయడం వల్ల భూమి మీదకు వచ్చే కిరణాలు ఆహార పదార్థాలలోకి ప్రవేశించకుండా దర్భలు అడ్డుపడుతాయని పండితులు చెబుతున్నారు.గ్రహణా సమయంలో ఆహార పదార్థాలలో

ఈ సమయంలో వచ్చే కిరణాలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి.కాబట్టి అవి ఆహార పదార్థాలలో చేరకుండా ఉండేలా దర్భలను వేస్తారు.ఇంకా చెప్పాలంటే గ్రహణం విడిచే వరకు ఆహార పదార్థాలపై గరికను వేసి గ్రహణం విడిచిన తర్వాత ఆ గరికను తీసివేసి, ఇంటిని శుద్ధి చేసుకుని ఆహార పదార్థాలను ఉపయోగించడం మంచిదని పండితులు చెప్పారు.

గ్రహణం ఏర్పడిన సమయంలో కిరణాలు పడినటువంటి ఆహార పదార్థాలు ( Foodstuffs )తింటే అనారోగ్యల బారిన పడతారని పండితులు చెబుతున్నారు.

ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే జున్ను.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా!
Advertisement

తాజా వార్తలు