ఆంజనేయుడు వీరాంజనేయుడి అవతారం ఎందుకు ఎత్తాడో తెలుసా?

చాలా గ్రామాల్లో ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే.

 అయితే పేర్లు వీరాంజనేయుడు, అభయాంజనేయుడు ఇలా పేర్లు వేరే కాని అన్ని ఆలయాల్లో ఉండేది ఒక్క ఆంజనేయ స్వామే అనుకుంటాం.

 కానీ వీరాంజనేయుడు అనేది హనుమంతుడి తొమ్మిది రూపాల్లో మెదటిది. అయితే ఈ వీరాంజనేయ స్వామి చాలా ప్రసిద్ధికెక్కాడు.

Do You Know Why Anjaneyaswamy Incarnated As Veeranjaneya, Veeranjaneya Anajanay

 అందు చేతనే వీరాంజనేయుడి ఆలయాలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఆంజనేయుడు వీరాంజనేయుడి అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? దాని వనుక కథ ఏంటో చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు మనం దాని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం. మైందుడనే బ్రాహ్మణుడు కాశీకి వెళ్లేందుకు ప్రయాణం అయ్యాడట.

Advertisement

 నదిని దాటే సమయంలో తీవ్రమైన గాలి వీచిందట. ఇక తాను బతికే అవకాశం లేదనుకున్న మైందుడు ఆంజనేయ స్వామిని ధ్యానించాడట.

 ఇంతలోనే పెద్ద శబ్దం రావడంతో కళ్లు తెరిచి చూశాడట. పడవలో ఉన్న ఆయన కళ్లు తెరిచి చూసే సరికి అవతలి గట్టు మీద ఉన్నాడట.

 అంతే కాకుండా తన చుట్టూ ప్రజలందరూ గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారట. ఏం జరిగిందని వారిని ప్రశ్నించగా.

 పెద్ద వానరం ఒకటి వచ్చి మిమ్మల్ని పడవతో సహా నెత్తి మీద పెట్టుకుని ఇక్కడ దింపి వెళ్లిందని చెప్పారట వారంతా. తన స్వామి హనుమే స్వయంగా వచ్చి తనను కాపాడినట్లు మైందుడు గ్రహించాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

 ఇలా మైందుడిని కరుణించిన అవతారమే వీరాంజనేయ స్వామి అవతారం.

Advertisement

తాజా వార్తలు