క‌ల‌బంద‌ను ఎవ‌రెవ‌రు అస్స‌లు తీసుకోకూడ‌దో తెలుసా?

క‌ల‌బంద‌ దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉండే ఔష‌ద మొక్క‌.ఈ క‌ల‌బంద‌లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోష‌కాలెన్నో నిండి ఉంటాయి.

అందుకే క‌ల‌బంద ఆరోగ్యానికే కాకుండా చ‌ర్మానికి, కేశాల‌కు కూడా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అయితే కలబంద వల్ల ఎన్ని లాభాలున్నాయో.

అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి.అందులోనూ కొంద‌రు అస్స‌లు క‌ల‌బంద జోలికే పోకూడ‌దు.

ఆ కొంద‌రు ఎవ‌రెవ‌రో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికో లేదా ఆరోగ్యానికి మంచిద‌నో క‌ల‌బంద‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటుంటారు.

Advertisement
Do You Know Who Should Not Take Aloe Vera Aloe Vera, Side Effects Of Aloe Vera,

అయితే కిడ్నీలో రాళ్లు ఉన్న వారు లేదా ఇత‌ర కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డే వారు క‌ల‌బంద‌ను అస్స‌లు తీసుకోరాదు.ఎందుకంటే, క‌ల‌బంద కిడ్నీ స‌మ‌స్య‌ల‌ను మ‌రింత తీవ్ర త‌రం చేసేస్తుంది.

గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో త‌ర‌చూ ఇబ్బంది ప‌డే వారు కూడా క‌ల‌బంద‌ను తీసుకో రాదు.ఒక వేళ‌ తీసుకుంటే మాత్రం జీర్ణ స‌మ‌స్య‌లు ఇంకా ఎక్కువ‌వుతాయి.

అలాగే గర్బిణీలు, సంతాన లేమి స‌మ‌స్య ఉన్న వారు, గర్భాశయ వ్యాధుల‌తో బాధ ప‌డే వారూ క‌ల‌బందకు దూరంగా ఉండాలి.

Do You Know Who Should Not Take Aloe Vera Aloe Vera, Side Effects Of Aloe Vera,

ప‌న్నెండు ఏళ్ల లోపు చిన్నారులు సైతం క‌ల‌బంద‌ను తీసుకోరాదు.ఎందుకంటే, క‌ల‌బందలో ఉన్న ప‌లు స‌మ్మేళ‌నాలు చిన్నారుల్లో క‌డుపు నొప్పి, క‌డుపులో అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయి.ఇక గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు, లివర్​ సమస్యలు ఉన్న వారు, పేగు సంబంధిత వ్యాధులతో ఇబ్బంది ప‌డే వారు కూడా క‌ల‌బంద‌ను తీసుకోక పోవ‌డ‌మే ఆరోగ్యానికి మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

కాకరకాయ చేదైనా.. ఔషధ గుణాలు పుష్కలం

అంతే కాదు, కడుపులో హెమరాయిడ్స్​ ఉన్న వారు, లో షుగ‌ర్ లెవ‌ల్స్ ఉన్న వారూ క‌ల‌బంద జోలికే వెళ్ల కూడ‌దు.

Advertisement

తాజా వార్తలు