పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా?

ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం చాలా ముఖ్యం.ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.

అందులో పాలకూర( Spinach ) మోస్ట్ ఫేమస్ అని చెప్పవచ్చు.పోషకాల పరంగా పాలకూర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఐరన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలను మనం పాలకూర ద్వారా పొందవచ్చు.వారానికి రెండు సార్లు పాలకూరను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు.

అయితే ఆరోగ్యానికి పాలకూర మంచిదే అయినప్పటికీ కొందరు మాత్రం తినకూడదు.ఆ కొందరు ఎవరు.? వారు ఎందుకు పాలకూర తినకూడదు.?వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.కిడ్నీ లో స్టోన్స్ ( Kidney Stones )ఉన్నవారు మరియు ఇతర తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు పాలకూరకు దూరంగా ఉండటమే మంచిది.

Advertisement

పాల‌కూర‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కిడ్నీ సంబంధిత సమస్యలను తీవ్రతరం చేస్తుంది.అలాగే కొందరు కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతుంటారు.

అలాంటి వారు పాలకూర తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే పాలకూరలో విటమిన్ కె ఉంటుంది.

ఇది రక్తాన్ని పలుచన చేసే ప్రభావాన్ని తగ్గిస్తుంది.తరచూ జీర్ణ సమస్యలతో( Digestive Disorders ) బాధపడుతున్న వారు పాలకూరను మితంగా తీసుకోవాలి.

పాలకూరలో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది.ఇది కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఉబ్బరం మరియు తిమ్మిరిని కలిగిస్తుంది.

ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందట.. ట్విస్ట్ ఏంటంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, శుక్రవారం 2024

పాలకూరను కొందరు పచ్చిగా తింటూ ఉంటారు.ఇలా చేయడం కరెక్ట్ కాదు.పాలకూరను స్ట్రీమ్ చేసుకుని ఉపయోగించాలి.

Advertisement

లేదంటే కడుపు ఉబ్బరం అజీర్తి వంటివి ఏర్పడతాయి.ఆక్సాలిక్ యాసిడ్‌తో పాటు పాలకూరలో ప్యూరిన్ అనే సమ్మేళనం ఉంటుంది.

అందువల్ల ఇప్పటికే కీళ్ల నొప్పులు, వాపులు మరియు మంట తో బాధపడుతున్న వారు పాలకూరను ఎక్కువగా తీసుకుంటే లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.

తాజా వార్తలు