సంవత్సరానికి 5 గంటలు మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలుసా..!

  • భారతదేశం ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు.ఈ ఆలయాలు ఎంతో అద్భుతంగా ప్రసిద్ధి చెంది అందరిని ఆకట్టుకుంటాయి.

    ఇలాంటి ఆలయాలను దర్శించడానికి ఇతర దేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.అదేవిధంగా మన దేశంలో కొలువై ఉన్న ఆలయాలలో కొన్ని రహస్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

    ఇప్పటికీ కొన్ని ఆలయాలలో దాగి ఉన్న రహస్యాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు.ఇలాంటి కోవకు చెందినదే దుర్గామాత ఆలయం.

    ఈ ఆలయం సంవత్సరానికి కేవలం ఐదు గంటలు మాత్రమే తెరిచి ఉంచి భక్తులకు అమ్మ వారి దర్శనం కల్పిస్తారు.ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‏లోని ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని గ్రియా బంద్ జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ప్రసిద్ధి చెందిన నీరాయ్ మాతా దేవాలయం ఉంది.

Advertisement
Do You Know Where The Temple Of Goddess Which Is Visited Only 5 Hours A Year, I

ఈ ఆలయంలోని అమ్మవారు సంవత్సరంలో కేవలం ఐదు గంటలు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.అదే విధంగా ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశం లేదు.అంతే కాకుండా ఈ ఆలయంలో అమ్మవారికి గులాబీలు, కుంకుమ, బంధన్ లాంటివి ఉపయోగించరు.

ఇక్కడ కేవలం కొబ్బరికాయ, అగర్బత్తిలను మాత్రమే ఉపయోగించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.

Do You Know Where The Temple Of Goddess Which Is Visited Only 5 Hours A Year, I

ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి సమయంలో కాంతి స్వయంగా వెలిగిపోతుందని అంటారు.ఈ అద్భుతం ఎలా ఉంది? ఇది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కలేదు.అదేవిధంగా ఆలయం వెలుపల తొమ్మిది రోజులపాటు నూనె లేకుండా దీపం వెలుగుతుందని అది కేవలం అమ్మ వారి మహిమ అని భక్తులు విశ్వసిస్తుంటారు.

నీరాయ్ మాతా ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.అసలు అమ్మవారి ఆలయంలోకి మహిళల ప్రవేశం ఎందుకు లేదనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే కాకుండా ఈ అమ్మ వారి ప్రసాదం కూడా మహిళలు తీసుకోరు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ఈ విధంగా తీసుకోవటం వల్ల వారికి చెడు జరుగుతుందని భావిస్తారు.ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో కూడా మహిళలు కనిపించకపోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు