ఎంతో పవిత్రమైన రావిచెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలో తెలుసా?

హిందువులు ఎంతో పవిత్రమైన మొక్కలుగా భావించే వాటిలో రావి చెట్టు ఒకటి.రావిచెట్టును సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపంగా భావిస్తారు.

ఈ క్రమంలోనే రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.

అయితే ఈ పవిత్రమైన చెట్టును పూజించడానికి పలువురికి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ చెట్టును తాకుతూ పూజ చేయవచ్చా? ఈ వృక్షాన్ని పూజించడానికి అనువైన సమయం ఏది అనే సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.మరి రావి చెట్టును ఏ సమయంలో తాకకూడదు ఈ చెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలి అనే విషయానికి వస్తే.

పురాణాల ప్రకారం రావి చెట్టును ఏ విధంగా పూజించాలి అనే విషయాలను నారద మహర్షి వివరించినట్లు తెలుస్తోంది.రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీస్నానమాచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి.

Advertisement
Do You Know When To Worship The Raavi Tree Raavi Tree, Pooja, Sunday, Tuesday ,

అయితే రావిచెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకుని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి.రావిచెట్టుకు ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్ర నామాలను చదువుతూ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.

రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షణ చేయాలి.

Do You Know When To Worship The Raavi Tree Raavi Tree, Pooja, Sunday, Tuesday ,

ముఖ్యంగా ఈ పవిత్రమైన వృక్షానికి ప్రతి రోజూ పూజలు చేసినప్పటికీ ఆదివారం, మంగళవారం ప్రతిరోజు సంధ్యాసమయంలో ఈ చెట్టును తాకకూడదు.కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా సంతానం లేని వారు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి నిత్యం పూజ చేయటం వల్ల వారికి సంతానయోగం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు