దీపావళి పండుగ రోజు సాయంత్రం.. ఈ దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఉపవాసాలు, నోములు, పూజలు, అభిషేకాలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోవు కానీ కొంత వరకు ఉపశమనం మాత్రం తప్పకుండా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

శనికి ఎవ్వరూ అతీతులు కాదు.

కానీ కొన్ని దోషా నివారణలు చేయడం వల్ల రాబోయే ముప్పు నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.వాటిలో ముఖ్యమైనది దీపావళి రోజు పెట్టే నువ్వుల దీపం అని పండితులు చెబుతున్నారు.

దీపావళి రోజు ( Diwali festival day )ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులను ధరించాలి.దేవుడి దగ్గర కూర్చొని మూడు గుప్పెడల నల్ల నువ్వులు,ఒక తెల్లటి వస్త్రంలో మూట కట్టాలి.

Do You Know What Will Happen If You Light This Lamp On The Evening Of Diwali ,

ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానబెట్టాలి.అది అలా పక్కన పెట్టేసి ఉంచాలి.దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవి పూజ( Lakshmi Devi Puja ) చేసిన తర్వాత తులసి కోట దగ్గర దివ్వా కొడతారు.

Advertisement
Do You Know What Will Happen If You Light This Lamp On The Evening Of Diwali ,

దివ్వ కొట్టి ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టి పడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తారు.కొందరు దీపాలను తీసుకొచ్చి ఇంటి ముందు వెలిగించే ముందు నువ్వుల దీపం( Nuvvula Deepam ) వెలిగిస్తే,మరికొంత మంది బాణసంచా కాల్చడం పూర్తయిన తర్వాత ఇక ఇంట్లోకి వెళ్లే ముందు ఈ నువ్వుల దీపాన్ని వెలిగిస్తారు.

Do You Know What Will Happen If You Light This Lamp On The Evening Of Diwali ,

నువ్వుల దీపాన్ని ( Nuvvula Deepam )ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట ఉంచాలి.నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఒక మూలన వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్లిపోవాలి.మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకు దీపం వెలిగేలా కర్పూరం పొడి కూడా దానిపై వేసి ఉంచాలి.

ఇలా చేయడం వల్ల శని దోషం దూరమైపోతుందని నిపుణులు చెబుతున్నారు.కొందరు ఇంటిముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శని దీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు.

అంటే శనిని తరిమికొట్టి లక్ష్మీదేవి( Goddess Lakshmi )కి ఆహ్వానం పలుకుతారని పండితులు చెబుతున్నారు.శని దీపం ఎప్పుడు పెట్టిన మంచిదే.దీపాల వరసలో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ, చివర్లో కానీ వెలిగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..
Advertisement

తాజా వార్తలు