గుడికి ఏ సమయాలలో వెళ్లాలో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలను దర్శించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.కొందరు ప్రతిరోజు వారికి సమీపంలో ఉన్న ఆలయాలను సందర్శిస్తుంటారు.

మరికొందరు వారానికి ఒక సారి అయినా వారి ఇష్టదైవాన్ని సందర్శించి వారి కోరికలను దేవుని సన్నిధిలో దేవుడికి తెలియజేసుకుంటారు.మరికొందరు మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటారు.

అయితే కొందరు దేవాలయాలను వారికి వీలున్న సమయంలో దర్శించుకుంటారు.అలా దర్శించుకోవడం మంచిది కాదని, దేవాలయాలను ఏ సమయాలలో దర్శించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Do You Know What Times To Go To The Temple, Temple,times To Go To The Temple,mor

సాధారణంగా మనం దేవాలయాలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో దర్శించుకుంటాము.ఉదయం స్నానమాచరించి పరగడుపున దేవాలయాలను దర్శించడం ఎంతో మంచిది.అలాగే ఉదయం శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలైన రాముడు, కృష్ణుడు తదితర దేవాలయాలను దర్శించడం ఎంతో మంచిది.

Advertisement
Do You Know What Times To Go To The Temple, Temple,times To Go To The Temple,mor

ఉదయం పూట ఈ దేవాలయాలను సందర్శించడం వల్ల గుడిలో ప్రసాదంగా తులసి తీర్థాన్ని ఇస్తారు.ఈ తులసి తీర్థాన్ని తీసుకోవడం ద్వారా శ్వాసకోశను శుభ్రపరుస్తుంది.అంతేకాకుండా ఉదయమే దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా గడిచి మనం అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని నమ్మకం.

అలాగే సాయంత్రం పూట శివాలయాలను సందర్శించాలి.శివాలయాల్లో మారేడు తీర్థం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

అంతేకాకుండా ఆ శివుడి అనుగ్రహం మనపై ఉండటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి.ఈ విధంగా గుడికి వెళ్లేటప్పుడు నియమ నిబంధనలను పాటించడం ద్వారా అధిక ఒత్తిడి నుంచి విముక్తి కలిగి ఎంతో సంతోషంగా గడుపుతారు.

మనిషి తన పనిని తాను నిర్వర్తిస్తూ ఆ దేవుడు పై విశ్వాసం కలిగి ఉండటం వల్ల సానుకూల దృక్పథంతో ముందుకు పయనిస్తాడు.ఇలా చేయడం ద్వారా తను అనుకున్న విజయాలను కూడా చేరుకోగలుగుతారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ విధంగా ప్రతి మనిషికి దైవం ఏదో ఒక రూపంలో తోడవుతుంది.

Advertisement

తాజా వార్తలు