శ్రీ కృష్ణుడికి 8 సంఖ్యతో ఉన్న ప్రత్యేక సంబంధం ఏమిటో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణమాసం( Shravana Masam )లో ఎన్నో పవిత్రమైన పండుగలను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.

అయితే శ్రావణమాసంలో వచ్చే ఇంకో ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణాష్టమి( Krishna Janmashtami ) అని దాదాపు చాలా మందికి తెలుసు.

శ్రీమహావిష్ణువు లోక కళ్యాణం కోసం ఎత్తిన అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి అవతారం అని పండితులు చెబుతున్నారు.కంసుని దురాగతాల నుంచి తన తల్లిదండ్రులను, ప్రజలను విముక్తి చేయడానికి శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి తిధి రోజు శ్రీకృష్ణుడు జన్మించినట్లు పండితులు చెబుతున్నారు.

Do You Know What Is The Special Relationship Of Lord Krishna With The Number 8 ,

విష్ణువు( Lord Vishnu ) ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు 8 సంఖ్యతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాడు.పంచాంగం ప్రకారం మనందరి జీవితంలో కొన్ని సంఖ్యలకు ప్రాముఖ్యత ఉంటుంది.సంఖ్యలు జాతకంలో కూడా లోతైన ప్రభావాన్ని చూపుతాయి.

ఎనిమిదవ సంఖ్య శనీశ్వరుడికి చెందినది.శ్రీకృష్ణుడికి ఎనిమిదవ సంఖ్యతో గాఢమైన అనుబంధము ఉంది.

Advertisement
Do You Know What Is The Special Relationship Of Lord Krishna With The Number 8 ,

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ధర్మంలో శ్రీ విష్ణువు భూమిపై 10 అవతారాలు ఎత్తినందున దశావతారీ అని పిలుస్తారు.శ్రీకృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారం.

కాబట్టి సంఖ్య ఎనిమిది చాలా ప్రత్యేకమైనది.శ్రీకృష్ణుడు జన్మించిన రోజు రాత్రి 7 ముహూర్తాలు గడిచి ఎనిమిదవ ముహూర్తంలో భగవంతుడు జన్మించాడు.

Do You Know What Is The Special Relationship Of Lord Krishna With The Number 8 ,

ఆ సమయంలో రోహిణి నక్షత్రం, అష్టమి తిధి కూడా ఉండడం మరో విశేషం.శ్రీకృష్ణుడు పుట్టకమందు దేవకి వాసుదేవుల ఎనిమిదవ సంతానం ద్వారా కంసుడు చంపబడుతాడని భవిష్యవాణి చెబుతుంది.దేవకి వాసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించి, తన మేనమామ కంసుడిని చంపాడు.

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు.అంతే కాకుండా కన్నయ్యకు 16,100 మంది గోపికలు ఉన్నారు.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

ఈ సంఖ్య మొత్తం కూడా ఎనిమిదే.శ్రీకృష్ణుడి ఉపాదేశం అని పిలవబడే పవిత్ర గ్రంథం భగవద్గీతలో ( Bhagavad Gita )ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

Advertisement

శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం తను ప్రతి యుగంలో అవతరిస్తానని ధర్మాన్ని స్థాపిస్తానని శ్రీకృష్ణుడు తెలిపాడు.అలాగే శ్రీకృష్ణ భగవానుడు భూమిపై 125 సంవత్సరాలు జీవించాడు.

దీని మొత్తం కూడా 8 అవుతుంది.

తాజా వార్తలు