ఆదిశేషునికి కలిగిన ఆశ ఏమిటో తెలుసా?

త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరికి ఆదిశేషుడు పరమభక్తుడని చెప్పవచ్చు.ఈక్రమంలోనే శ్రీహరికి ఆదిశేషుడు మెత్తటి పాన్పులాగా ఉంటూ శ్రీహరికి సేవ చేస్తున్నాడు.

ఇలా ఎంతో సంతోషంగా శ్రీహరిని తన పై మోస్తూ ఆనందం వ్యక్తం చేసేవాడు.ఎప్పుడూ కూడా శ్రీహరి తనకి బరువుగా అనిపించలేదు.

ఇదిలా ఉండగా ఒకరోజు మాత్రం విష్ణుమూర్తి ఆదిశేషుడికి విపరీతమైన బరువు అనిపించాడు.తనని మోయడానికి కూడా వీలు కాని అంత బరువు పెరిగిపోవడంతో ఆదిశేషుడు స్వామి బరువు తట్టుకోలేక స్వామి ఇవాళ ఎందుకు మీరు ఇంత బరువుగా ఉన్నారు అని అడిగాడు.

ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తను సంతోషంగా ఉండడానికి గల కారణాలను వివరించాడు.ఈ క్రమంలోనే విష్ణు మూర్తి మాట్లాడుతూ ఆదిశేష.

Advertisement
Do You Know What Hope Aadisesha, Adisesha Has, Ninnaduloka, Lord Siva, Srihari,

నిన్న భూలోకానికి వెళ్లాను కదా అక్కడ ఒక అద్భుతమైన పుణ్య ప్రదేశంలో శివుడు తాండవమాడటం చూశాను.అది చూసి నా మనసు ఎంతో సంతోషించింది.

ఈ సంతోషంతోనే నా మనసు బరువెక్కింది అంటూ సమాధానం చెప్పాడు.ఈ విధంగా శివ తాండవం గురించి శ్రీహరి వివరిస్తుంటే ఆ అద్భుతమైన ప్రదర్శన తనిఖీ చూడాలని ఆశ కలిగింది.

ఈ క్రమంలోనే ఆదిశేషుడు విష్ణుమూర్తితో అంతటి మహా భాగ్యం చూడటానికి నాకు అవకాశం కల్పించండి ప్రభు అని శ్రీహరిని వేడుకున్నాడు.ఈ క్రమంలోనే శ్రీహరి నువ్వు భూలోకానికి వెళ్లి ఆ శివతాండవం చూడమని ఆదేశించాడు.

Do You Know What Hope Aadisesha, Adisesha Has, Ninnaduloka, Lord Siva, Srihari,

విష్ణుమూర్తి చెప్పగానే ఆదిశేషుడు వెంటనే మనిషి తల పాము రూపంతో కూడిన శరీరాన్ని పోలి అత్రిమహర్షి ధర్మపత్నియైన అనసూయదేవి చేతులలో పడ్డాడు.ఒక్కసారిగా ఈ వింత రూపంలో ఉన్న బిడ్డను చూసి అనసూయాదేవి బిడ్డను విసిరేసింది.ఈ క్రమంలోనే ఆ బిడ్డ మాట్లాడుతూ.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

తల్లి భయపడవద్దు నేను మీ కుమారుడిని మీరే నన్ను పెంచాలని చెప్పడంతో అనసూయాదేవి తనని దగ్గరకు చేర్చుకుంది.ఈ విధంగా బిడ్డను చెంతకు చేర్చుకున్న అనసూయాదేవి తనకి పతంజలి అనే పేరును పెట్టింది.

Advertisement

ఈ క్రమంలోనే ఆ బిడ్డ పెరిగి పెద్దదవుతూ సకల శాస్త్ర కోవిదుడై వెలిగాడు.ఈ క్రమంలోనే ఒక రోజు చిదంబరములో శివుడు ఆనంద తాండవం చేస్తున్నాడు అని తెలుసుకుని తన తల్లిదండ్రుల అనుమతితో అక్కడికి వెళ్లి తన కోరికను తీర్చుకుందట.

ఈ విధంగా శివతాండవం చూడటం కోసం ఆదిశేషుడు పతంజలిగా మారాడని పురాణాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు