Flax seeds : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అవిసె గింజలు నానబెట్టి.. ఆ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?

ఒక గ్లాసు నానబెట్టిన అవిసె గింజల( Flax seeds ) నీటితో మీ రోజును ప్రారంభించడం వలన మీ శరీరం పై గొప్ప ప్రభావాలు ఉంటాయి.

ఇది ఉదయం టీ, కాఫీకు ప్రత్యామ్నాయం అవిసె గింజలు కేలరీలు, పిండి పదార్థాలు, కొవ్వు, ఫైబర్, ప్రోయామిన్, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, సెలీనియం, జింక్, విటమిన్ b6, ఐరన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లం లాంటి పోషకాలకు గొప్ప మూలం అని చెప్పవచ్చు.

అవిసె గింజలు అవసరమైన పోషకలతో నిండి ఉంటాయి.కీళ్ల నొప్పులు,క్యాన్సర్, రక్తనాళాల వ్యాధులు, అధిక రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత, హృదయ సంబంధ వ్యాధులు, డైవర్టిక్యులర్ వ్యాధి, మరెన్నో అనారోగ్య సమస్యలు( health problems ) ఉన్నవారికి ఖాళీ కడుపుతో నానబెట్టిన అవిసె గింజల నీరు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీచుతో కూడిన అవిసె గింజలను నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వలన మలబద్ధకం ( Constipation )నుండి ఉపశమనం పొందవచ్చు.అలాగే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.జీర్ణ క్రియలో సమస్యలు ఉంటే ఖాళీ కడుపుతో అవిసె గింజల నీటిని తాగడం ప్రారంభించాలి.

ఇది పేగు సమస్యలను అధిగమిస్తుంది.అవిసె గింజలు బేధి మందుగా పనిచేస్తుంది.

Advertisement

ఎందుకంటే వాటిలో ఫైబర్, లిగ్నన్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ ( Fiber, lignans, omega three fatty acids )లు ఉంటాయి ఇవి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు.అవిసె గింజలు చర్మాన్ని అవసరమైన పోషకాలతో నింపుతుంది.

ప్రకాశంవంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా అందిస్తుంది.

వాటిలో మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, లిగ్నన్స్, అవసరమైన కొవ్వు అమ్లాలు ఉంటాయి.ఇది చర్మం చికాకును తగ్గిస్తుంది.అలాగే మొటిమలు కలిగించే ఆండ్రోజన్ హార్మోన్ ల ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది.

ఖాళీ కడుపుతో అవిసె గింజల నీటిని తాగడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.అలాగే క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది.అవిసె గింజలు శరీరంలోని ఈస్ట్రోజన్ల జీవ క్రియను మారుస్తుంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు చికిత్సలు సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు