నిద్రపోయే సమయంలో చెవుల్లో బడ్స్ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది నిద్రపోయే సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు.ఇక యువత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా తమ చేతిలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపిస్తారు.అంతేకాకుండా మొబైల్ ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్ లేదా బ్లూటూత్ బడ్స్( Bluetooth Earbuds ) చెవిలో పెట్టుకుని ఫోన్ చూస్తూ నిద్రపోతూ ఉంటారు.

అయితే ఇది చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది.అయితే ఈ అలవాటు ఉంటే ఆరోగ్యంపై ఖచ్చితంగా దుష్ప్రభావం పడుతుంది.

మన రోజువారి జీవితంలో అలవర్చుకునే వివిధ రకాల అలవాట్లు ఆరోగ్యం పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.అందులోనే ఇది కూడా ఒకటి.

Advertisement

రాత్రివేళ నిద్రపోయే సమయంలో చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని మొబైల్ చూస్తూ ఉండిపోవడం అస్సలు మంచిది కాదు.అప్పుడప్పుడు ఇలా చేస్తే పర్వాలేదు.కానీ రోజు ఇదే అలవాటు చేసుకుంటే మాత్రం కచ్చితంగా దుష్ప్రభావం పడుతుంది.

అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది.ఇక రాత్రంతా చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని ఫోన్ చూస్తూ నిద్రపోవడం వలన చెవుల సామర్థ్యం తగ్గిపోతుంది.

అంతేకాకుండా చెవి నొప్పి( Ear pain ) సమస్య కూడా వస్తుంది.కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి అలవాటును దూరం చేసుకోవాలి.

ఎందుకంటే ఇది మీ ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపిస్తుంది.తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఇంకా కొంతమంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో చెవుల్లో బడ్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటారు.అయితే ఇలా చేయడం మీ స్ట్రెస్ లెవెల్ ను పెంచుతుంది.అదే పనిగా చెవుల్లో పెట్టుకుని తిరుగుతుంటే చెవుల్లో బీప్ సౌండ్ సమస్య ఏర్పడుతుంది.

Advertisement

ఇక ఈ సమస్యకు ఎక్కడ కూడా పరిష్కారం లేదు.అంతేకాకుండా చెవుల్లో వ్యాక్స్ కూడా విపరీతంగా ఏర్పడుతుంది.

ఒకవేళ ఎవరైనా 24 గంటలు అదే పనిగా చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకుంటే చెవుల్లో ఏర్పడే వ్యాక్స్ లోపలకి వెళ్ళిపోతుంది.ఇది చాలా ప్రమాదకరం.

దీని వలన చెవులలో దురద, నొప్పి లాంటివి మొదలవుతాయి.కాబట్టి వీలైనంత వరకు ఈ అలవాటును దూరం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

తాజా వార్తలు