నెల‌స‌రి స‌మ‌యంలో పుదీనా తింటే ఏం అవుతుందో తెలుసా?

పుదీనా. దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.అన్ని సీజ‌న్స్ లోనూ దొరికే ఆకుకూర‌ల్లో ఇది ఒక‌టి.

క‌మ్మ‌టి రుచి, అద్భుత‌మైన సువాస‌న క‌లిగి ఉండే పుదీనాను వంట‌ల్లో విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.పిల్ల‌లు సైతం పుదీనా ఫ్లేవ‌ర్ ను ఎంత‌గానో ఇష్డ‌ప‌డుతుంటారు.

అయితే రుచి, సువాస‌న ప‌రంగానే కాదు.పుదీనాలో పోష‌కాలు సైతం మెండుగా నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్యానికి పుదీనా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.ముఖ్యంగా ఆడ‌వారికి పుదీనా ఓ వ‌ర‌మ‌నే చెప్పాలి.

Advertisement

ఎందుకంటే, నెల‌స‌రి స‌మ‌యంలో వేధించే వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే సామ‌ర్థ్యం పుదీనాకు చ‌క్క‌గా ఉంది.నెల‌స‌రి స‌మ‌యంలో పుదీనా తింటే ఎంతో మంచిది.

చాలా మంది ఆడ‌వారు నెల‌స‌రి స‌మ‌యంలో తీవ్ర‌మైన క‌డుపు నొప్పిని ఫేస్ చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే నొప్పిని త‌గ్గించుకోవ‌డం కోసం పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకుంటారు.

కానీ, అలాంటి స‌మ‌యంలో పుదీనా ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని వేడి వేడిగా ఒక క‌ప్పు తాగితే క‌డుపు నొప్పి మాత్ర‌మే కాదు న‌డుము నొప్పి, త‌ల‌నొప్పి వంటివి కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే నెల‌స‌రి స‌మ‌యంలో కొంద‌రు మ‌ల‌బ‌ద్ధ‌కం, గ్యాస్‌, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు.అయితే ఉద‌యాన్నే ఐదారు పుదీనా ఆకుల‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి నోట్లో వేసుకుని న‌మిలి మింగేయాలి.ఆపై గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని సేవించాలి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

ఇలా చేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.మ‌ల‌బ‌ద్ధ‌కంతో పాటు ఇత‌ర జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

Advertisement

అంతే కాదు, నెల‌సరి స‌మ‌యంలో పుదీనా టీ లేదా పుదీనా జ్యూస్‌ను తీసుకుంటే నీర‌సం, అల‌స‌ట‌, ఒత్తిడి, వికారం, వాంతులు, తల తిరగడం, మూడ్ స్వింగ్స్‌ వంటి సమస్యల‌కు దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు