జలుబు చేసిన‌ప్పుడు మునక్కాయ‌ తింటే ఏమవుతుందో తెలుసా..?

ప్రస్తుత వర్షాకాలంలో అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే రుగ్మతల్లో జలుబు ఒకటి.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ.

తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.జలుబు కారణంగా ముక్కు బ్లాక్ అవ్వ‌డం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చిరాకు తదితర సమస్యలు తలెత్తుతాయి.

ఈ క్రమంలోనే జలుబును వదిలించుకునేందుకు మందులు వాడుతుంటారు.అయితే అలాంటప్పుడు కొన్ని కొన్ని ఆహారాలు జలుబును వేగంగా వదిలించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.

Do You Know What Happens If You Eat Drumsticks When You Have A Cold Drumstick,

మునక్కాయ( Drumsticks ) కూడా ఆ కోవకే చెందుతుంది.జలుబు చేసినప్పుడు మునక్కాయ తింటే చాలా మేలంటున్నారు నిపుణులు.ఎందుకంటే మునక్కాయ జలుబు మరియు ఇతర ఇన్ఫెక్షన్‌ల నివార‌ణ‌కు సహాయపడే కూరగాయ.

Advertisement
Do You Know What Happens If You Eat Drumsticks When You Have A Cold? Drumstick,

మున‌గ‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) జలుబు, ఫ్లూ మరియు ఇతర సాధారణ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉబ్బసం, గురకతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం అందిస్తాయి.

మున‌గ‌లో పుష్క‌లంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బాక్టీరిసైడ్, బాక్టీరియోస్టాటిక్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్లు, వ్యాధులను నివారిస్తుంది.

కాబ‌ట్టి జ‌లుబు చేసిన‌ప్పుడు త్వ‌ర‌గా రిక‌వ‌రీ అయ్యేందుకు మున‌క్కాయ‌ను కూర రూపంలో లేదా సూప్ రూపంలో తీసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

Do You Know What Happens If You Eat Drumsticks When You Have A Cold Drumstick,
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

పైగా మునక్కాయ‌లో ఫైబర్ ఉంటుంది.ఇది జీర్ణవ్యవస్థ ప‌ని తీరును పెంచుతుంది.అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం వంటి జీర్ణ‌ స‌మ‌స్య‌లు మీ ద‌రిచేర‌కుండా అడ్డుకుంటుంది.

Advertisement

ప్ర‌స‌వం అనంత‌రం మున‌క్కాయ‌ను తీసుకుంటే బాలింత‌ల్లో పాల ఉత్ప‌త్తి బాగా పెరుగుతుంది.బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్ధీకరించడంలో, ఎముక‌ల‌ను దృఢంగా మార్చ‌డంలో సైతం మున‌క్కాయ ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి ఈ అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన కూర‌గాయ‌ను వారానికి క‌నీసం ఒక్క‌సారైనా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు